
భారతదేశంలో అద్భుతమైన, పురాతనమైన, ఛారిత్రాత్మకమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. నీటిలో ఉన్న దేవాలయాలు, ఆకాశాన్ని తాకేంత ఎత్తులో కట్టిన టెంపుల్స్ భక్తులను కట్టిపడేస్తుంటాయి. మనసులో భక్తి పారవశ్యాన్ని నింపడమే కాకుండా కొన్ని వందల ఏళ్లు వెనక్కి తీసుకెళ్తాయి.అలాంటి అత్యద్భుతమైన దేవాలయాల్లో రామేశ్వరం రామనాథస్వామి గుడి ఒకటి అని చాలామందికి తెలియదు.
వారణాసి తర్వాత హిందువులకు రామేశ్వరం అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా నిలుస్తోంది. హిందువులు జీవితకాలంలో ఒక్కసారైనా ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలని భావిస్తారు. రామాయణం ప్రకారం, రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత.. రామేశ్వరంలోనే ఎక్కువ సమయం గడిపాడని పండితులు చెబుతారు. రావణుడిపై విజయం సాధించిన తర్వాత, శ్రీరాముడు సతీ సమేతంగా.. తన సోదరుడు లక్ష్మణుడు, హనుమంతుడుతో పాటు వారి వేలాది వానర సైన్యం సహాయంతో రామేశ్వరం చేరుకున్నాడని అంటారు.
రామేశ్వరం పుణ్యక్షేత్రంలో, శ్రీ రాముడు శివుడిని ఆరాధించి, కొలిచాడని, అందుకే ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు కలిసి పూజలు చేస్తారని విశ్వసిస్తారు. ఈ కారణం వల్లే రామేశ్వరాన్ని భారతదేశంలోని జాతీయ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రకటించారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న రామేశ్వర స్వామి ఆలయం ప్రతి భక్తుడిని, ప్రతీ పర్యాటకుడినీ ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం యొక్క అద్భుతమైన నిర్మాణం, పొడవైన నడక మార్గాలు, అందంగా చెక్కిన స్తంభాలతో అత్యద్భుతంగా కనిపిస్తుంది.
38 మీటర్ల ఎత్తైన గోపురం ఈ రామేశ్వర ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్వామి వివేకానందుడు 1897లో ఈ ఆలయంలో పూజలు చేశారని స్థానికులు చెబుతారు. ఇది శివయ్య జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ముందుగా ఈ ఆలయ విశేషాలు తెలుసుకని వెళ్తే ఏవీ మిస్ అవకుండా చూడొచ్చు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం రామేశ్వరం.ఇక్కడే రామనాథ స్వామి దేవాలయం ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైకి.. 572 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రామేశ్వరం.. ప్రధాన భూభాగం నుంచి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది.
రామేశ్వరానికి వెళ్లే భక్తులు ఆలయ ప్రధాన గర్భగుడిలోకి ప్రవేశించడానికి ముందు, ఆలయానికి సమీపంలో ఉన్న పవిత్రమైన అగ్ని తీర్థం అనే బీచ్‌లో తప్పనిసరిగా స్నానం చేయాలి. ఇలా చేస్తే భక్తుల శరీరంతో పాటు వారి ఆత్మ శుద్ధి అవుతాయని, శివుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. ఈ రామేశ్వర ఆలయం 1,212 స్తంభాలతో నిర్మితమవడంతో.. ఈ స్తంభాల వల్ల రామేశ్వర ఆలయం బలమైన పునాదితో ఉంటుంది. ఈ స్థంభాలలో ఒక్కో స్థంభం ఒక్కో అద్భుతమైన హిందూ శిల్పాలతో అందంగా కనిపిస్తాయి. అలాగే, ఈ ఆలయంలోని ప్రతి స్తంభం ఎత్తు 30 అడుగులుగా ఉంటుంది. రామేశ్వర స్వామి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవం చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనదిగా భావించే భక్తులు.ప్రపంచ నలుమూలల నుంచి పాల్గొంటారు.
రామాయణంతో ఈ రామనాథస్వామి ఆలయానికి సంబంధం ఉంది. రామాయణంలో సీతాపహరణ చేసినందుకు రాముడు రావణుడిని వధిస్తాడు, రావణుడు హాఫ్-బ్రాహ్మిణ్ అని చెబుతారు. బ్రాహ్మణుడిని చంపడం మహా పాపం అని పురాణాలు చెబుతాయి కాబట్టి రాముడు మహా పాపం చేసినట్లు అయిందని అందుకే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, రాముడు ఒక లింగాన్ని ఇక్కడ స్థాపించాడని అంటారు. ఈ లింగమే రామనాథస్వామి ఆలయంలో ప్రతిష్టించారని.. అందుకే ఈ టెంపుల్ హిందువులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మారింది. ఈ రామేశ్వర ఆలయం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ ధామ్స్‌లో ఒకటిగా ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. వైష్ణవ యాత్రికులకు ఈ ధామాలన్నిటి గురించి ఆది శంకరాచార్య నిర్వచించారు. ఆది శంకరాచార్య వైష్ణవ యాత్రికులకు ఈ పవిత్ర ధామాల ద్వారా ఒక్కో ధామ్ ప్రాముఖ్యతను వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE