రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సన్‌రైజ్ వ్యాలీ ప్రాంతంలో అడవికి సమీపంగా ఉన్న ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. ఆ ఇంటి గార్డెన్‌లో ఉన్న నల్ల లాబ్రడార్ రిట్రీవర్ కుక్కపై దాడి చేసింది. చిరుత తన పంజాతో కుక్కను కదలకుండా పట్టుకుని, దాని మెడ కొరికి చంపేందుకు ప్రయత్నించింది.
ఆ స్థితిలో కుక్క గట్టిగా అరుస్తూ, చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కుక్క అరుపులను విన్న యజమానురాలు వెంటనే బయటకు వచ్చి కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఇంటి లోపలకు పరిగెత్తిన కుక్క కొద్ది గాయాలతో బయటపడింది .
ఈ సంఘటన ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని వందల మందిని కదిలించిన ఈ వీడియో క్రూర జంతువుల క్షీణిస్తున్న నివాస స్థలాలపై మనిషి ప్రభావాన్ని మరింత ఆలోచింప చేస్తుంది.
అడవుల నియంత్రణ లేకుండా చెట్లు నరికివేయడం వల్ల జంతువుల ఆహారం, నీటి అవసరాలు కోసం జనావాసాల వైపు చేరుతున్నాయి. అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామాల్లోకి రావడం, మనుషుల జీవితాలను సవాల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రూర జంతువులు కేవలం రాత్రిపూట మాత్రమే కాదు, పగలు కూడా గ్రామాల్లోకి దాడులకు వస్తుండటం గమనార్హం.
ఈ ఘటన మౌంట్ అబూ ప్రాంతంలో అడవులకు సమీపంగా నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికగా నిలుస్తోంది.
Shocking incident in Mount Abu as a panther attacks a dog near Forest Eco Lodge. 🐾 This has raised safety concerns among tourists, especially after similar incidents in Udaipur. Stay alert and follow safety guidelines if you're visiting! #MountAbu #WildlifeSafety #PantherAttack… pic.twitter.com/psP7dbSwK7
— Pradeep Singh (@PBeedawat) November 15, 2024