రేపు హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Narendra Modi will Visit Haryana and Punjab on August 24th, PM Modi will Visit Haryana and Punjab on August 24th, Modi will Visit Haryana and Punjab on August 24th, Haryana and Punjab, PM Narendra Modi, PM Modi Haryana and Punjab Visit, PM Modi Haryana and Punjab Tour, Prime Minister Narendra Modi, PM Modi Tour, PM Modi Haryana and Punjab Tour News, PM Modi Haryana and Punjab Tour Latest News And Updates, PM Modi Haryana and Punjab Tour Live Updates, Mango News, Mango News Telugu,

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 24, బుధవారం) హర్యానా మరియు పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు రెండు ముఖ్యమైన ఆరోగ్య కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా బుధవారం ఉదయం 11 గంటలకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమృత ఆసుపత్రిని ప్రధాని ప్రారంభిస్తారు. ఫరీదాబాద్‌లో అమృత హాస్పిటల్‌ను ప్రారంభించనున్నందున జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ఆధునిక వైద్య మౌలిక సదుపాయాల లభ్యత మరింత ఊపందుకుంటుందని చెప్పారు. మాతా అమృతానందమయి మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2600 పడకలు ఉన్నాయని, దాదాపు రూ.6000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి, ఫరీదాబాద్ మరియు మొత్తం ఎన్సీఆర్ ప్రాంతం ప్రజలకు అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందిస్తుందని చెప్పారు.

అనంతరం ప్రధాని మోదీ పంజాబ్ లోని మొహాలీకి వెళ్లి మధ్యాహ్నం 2:15 గంటలకు ముల్లన్‌పూర్, న్యూ చండీగఢ్, సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్ జిల్లా (మొహాలీ)లో ‘హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్’ ను జాతికి అంకితం చేయనున్నారు. ఇది పంజాబ్ మరియు పొరుగు రాష్ట్రాలు, సమీప కేంద్ర పాలిత ప్రాంతాల నివాసితులకు ప్రపంచ స్థాయి క్యాన్సర్ సంరక్షణను అందించనుంది. కేంద్రప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ అయిన టాటా మెమోరియల్ సెంటర్ ద్వారా దాదాపు 660 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ 300 పడకల సామర్థ్యంతో కూడిన తృతీయ సంరక్షణ ఆసుపత్రి అని తెలిపారు. కాన్సర్ శస్త్రచికిత్స, రేడియోథెరపీ మరియు మెడికల్ ఆంకాలజీ-కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ మరియు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి అందుబాటులో ఉన్న ప్రతి చికిత్సా పద్ధతులను ఉపయోగించి అన్ని రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ఈ ఆసుపత్రి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − twelve =