పీడీఆర్డీ గ్రాంట్ కింద 14 రాష్ట్రాలకు 6,195.08 కోట్లు, ఏపీకి రూ.491.42 కోట్లు

fifteenth Finance Commission, Finance Commission, Mango News, National News, PDRD, PDRD For States, PDRD Grant, Post Devolution Revenue Deficit, Post Devolution Revenue Deficit Grant, Union Budget, Union Finance Ministry, Union Finance Ministry Releases PDRD Grant, Union Ministry of Finance

కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు తాజాగా రూ.6,195.08 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్( పీడీఆర్డీ) గ్రాంట్ కింద 11 వ విడతగా 14 రాష్ట్రాలకు 6,195.08 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 15వ ఆర్థిక సంఘం పీడీఆర్డీ గ్రాంట్ కింద 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 14 రాష్ట్రాలకు 74,341 కోట్లు సిఫార్సు చేసిందని, ఇందులో ఇప్పటివరకు రూ.68,145.91 కోట్లు (91.66%) విడుదల చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ 14 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, తమిళనాడు, త్రిపుర, సిక్కిం, ఉత్తరాఖండ్‌ ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా విడుదలైన 11 విడత పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వివరాలు:

  • ఆంధ్రప్రదేశ్‌ – రూ.491.42 కోట్లు
  • అసోం – రూ.631.58 కోట్లు
  • హిమాచల్‌ ప్రదేశ్‌ – రూ.952.58 కోట్లు
  • కేరళ – రూ.1276.92 కోట్లు
  • మణిపూర్‌ – రూ.235.33 కోట్లు
  • మేఘాలయ – రూ.40.92 కోట్లు
  • మిజోరాం – రూ.118.50 కోట్లు
  • నాగాలాండ్‌ – రూ.326.42 కోట్లు
  • పంజాబ్‌ – రూ.638.25 కోట్లు
  • పశ్చిమబెంగాల్‌ – రూ.417.75 కోట్లు
  • సిక్కిం – రూ.37.33 కోట్లు
  • తమిళనాడు – రూ.335.42 కోట్లు
  • త్రిపుర – రూ.269.67 కోట్లు
  • ఉత్తరాఖండ్ -‌ రూ.423 కోట్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ