ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఫిబ్రవరి 6, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,350 కు చేరింది. కొత్తగా కరోనా నుంచి 133 మంది రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కొత్తగా విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7159 కి పెరిగింది. గత 24 గంటల్లో 34864 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, ఏపీలో మొత్తం పరీక్షల సంఖ్య 1,33,11,542 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 6, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,88,350
- కొత్తగా నమోదైన కేసులు : 75
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,80,179
- యాక్టీవ్ కేసులు : 1012
- మొత్తం మరణాల సంఖ్య : 7159
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ