ఇంధన ధరల పెంపు: పెట్రోల్‌, డీజిల్‌ లీటరుకు రూ.2 పెంపు

Fuel Price Hike ₹2 Increase In Petrol Diesel Shocks Consumers Across India,central government decision,crude oil prices,Excise Duty,fuel price hike,petrol diesel rates,Mango News,Mango News Telugu,Petrol Price Hike,India,India News,Petrol,Diesel,India Hikes Excise Duty By ₹2 Each On Petrol And Diesel,Centre Hikes Excise Duty On Petrol And Diesel By ₹2 Each,Central Government Raises Excise Duty On Petrol And Diesel By ₹2 Per Litre,Petrol And Diesel,Petrol And Diesel Hikes,Petrol And Diesel Price Hike,Fuel Price Hike News,Govt Hikes Excise Duty On Petrol And Diesel By ₹2 Per Litre,Fuel Price Hike Updates,Hardeep Singh Puri Live,Hardeep Singh Puri,Petrol And Diesel Price Hike Alert,Fuel Excise Duty Hike,Excise Duty,Fuel Excise Duty,Govt Hikes Excise Duty On Petrol And Diesel,Latest Petrol Price Hike

ఇంధన వినియోగదారులకు మరోసారి చేదు వార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వాహనదారులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానుంది.

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, ఈ పెంపు వల్ల నేరుగా సామాన్యుడి జేబుపై భారం పడదని తెలిపింది. అయితే, వాస్తవంగా చూస్తే ప్రతి రూపాయి పెరుగుదల కూడా సామాన్యులకు తీవ్ర భారం అవుతోంది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇటీవల 15 శాతం వరకూ తగ్గాయి. ప్రస్తుతం 1 బ్యారెల్‌ ముడి చమురు ధర $63.34గా ఉంది, ఇది గత కొన్ని నెలల్లో అత్యల్ప స్థాయి. చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో భారత పెట్రోలియం, రిలయన్స్‌, హిందూస్తాన్ పెట్రోలియం వంటి కంపెనీల లాభాలు పెరిగాయి.

ఈ లాభాల మధ్య ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచినట్టు తెలుస్తోంది. అయితే, ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గకపోవడం, పైగా ఎక్సైజ్ పెంచి మరింత భారాన్ని మోపడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రస్తుతంగా చమురు కంపెనీలు పెరిగిన సుంకాన్ని వినియోగదారులపై వేస్తున్నాయా? లేక తమ లాభాల్లోంచి భారం మోయతలిస్తాయా? అనేది పరిశీలించాల్సిన అంశం.