
ప్రకృతిలో చూడాలే కానీ ఎన్నో అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి. సెలయేళ్లు, మేఘాలు, వర్షం, మంచు , కొండలు, పర్వతాలు,పువ్వులు,చెట్లు ఇలా ప్రతీదానిలో అందాలు కనిపిస్తూనే ఉంటాయి. అలా కొన్ని ఎన్నో ప్రత్యేకతలతో కనిపిస్తూ చూపు తిప్పుకోనివ్వవు. అయితే ఆకర్షణీయమైన రకానికి చెందిన ఓ అరుదైన మొక్క ఇప్పుడు అంతరించిపోయే మొక్కల లిస్టులోకి చేరిపోయిందట.
చూడటానికి ఆకర్షణీయంగా కనిపించే ఈ మొక్కకు ఓ ప్రత్యేకత ఉంది. దీని పూలు అచ్చంగా లిప్ స్టిక్ వేసిన ఆడవారి మృదువైన ఎర్రని పెదవులను పోలి ఉంటాయి. ఇవి చూడడానికే కాదు తాకినా కూడా అద్భుత అనుభూతికి లోనవుతారట. కోస్టా రికా, ఈక్వెడార్, దక్షిణ అమెరికా దేశాల వర్షారణ్యాలకు దగ్గరగా ఉండే సైకోట్రియా లో ప్రత్యేకంగా కనిపించే మొక్క ఎలాటా. దీనిని హాట్ లిప్స్ ప్లాంట్ లేదా హుకర్స్ లిప్స్ ప్లాంట్ అని పిలుస్తారు.
హాట్ లిప్స్ ప్లాంట్ ఉష్ణమండల వృక్షజాలంలో ఒక అద్భుతంగా నిలుస్తుంది. ఇది చూడటానికి ఆడవారి పెదవులను పోలి కలిపించే పూలతో ఉంటుంది. ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రాక్ట్స్ అని పిలువబడే దాని ప్రత్యేకమైన పువ్వులే. ఈ బ్రాక్ట్‌లు అమ్మాయిల పెదవులలాగే .. ఎరుపు, కండకలిగిన రెండు మెరిసే పెదవుల వలె కనిపిస్తాయి. హమ్మింగ్ బర్డ్స్, సీతాకోకచిలుకలను ఆకర్షించడానికి వీలుగా వీటి పరాగ సంపర్కాలు రూపు దిద్దుకుని ఉంటాయి.
అందమైన ఎరుపు రంగు, పండిన పండులా ఈ బ్రాక్ట్స్ కనిపిస్తాయి. ఈ బ్రాక్ట్సే హమ్మింగ్ బర్డ్‌లు, సీతాకోకచిలుకల వంటి పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. వృక్షశాస్త్రం మీద మక్కువ ఉన్నవారు, నేచుర్ లవర్స్ ఈ పువ్వుల మధ్య ఉండే పుప్పొడిని తమ వెంట తీసుకువెళతారు. ఈ మొక్కకు పూచే పువ్వులు చిన్నవి, నక్షత్రాల ఆకారంలో ఉన్నా కూడా..అవి అద్భుతమైన బ్రాక్ట్‌లా మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించవు.
ఈ మొక్క పువ్వు ..దాని బ్రాక్ట్‌లా అంత ఆకర్షణీయంగా ఉండవు. తెలుపు రంగులో, సువాసనతో సాధారణంగా డిసెంబర్, మార్చి మధ్య నుంచి ఇవి పుష్పిస్తాయి. మధ్య అమెరికాలోని ప్రజలు ప్రేమికుల రోజున ఈ మొక్కను బహుమతిగా ఇచ్చి పుచ్చుకోవడం అక్కడి స్థానికులకు అలవాటు. అంతే కాకుండా దీని బెరడు, ఆకులను చాలామంది చర్మ రుగ్మతులకు, అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
కానీ కొంత కాలంగా ఈ మొక్క మెల్లగా అంతరించే విధంగా కనిపిస్తుందని.. వృక్షశాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులతోనే ఈ మొక్క అంతరించిపోతుందని అంటున్నారు. ఈ అరుదైన జాతి మనుగడను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ, రక్షణ అందించడం చాలా అవసరమని కోరుతున్నారు. తగిన శ్రద్ధ తీసుకుంటే మాత్రమే హుకర్స్ లిప్స్ ప్లాంట్ అందాలను, ఆయుర్వేద గుణాలను భవిష్యత్ తరానికి అందుబాటులో ఉండేలా చేయగలుగుతామని అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE