నేషనల్‌ హైవేపై ఉండే ఆ బాక్స్‌లను గమనించారా?

Notice Those Boxes On The National Highway, Notice Those Boxes On Highway, National Highway, Those Boxes On The National Highway, Highways SOS Box,Where Are The Life Savers, SOS Box, Life Savers Boxes, National Highway Life Savers Boxes, Accidents On Highways, Emergencey Call On National Highways, Emergencey Help Boxes On Highway, National Highway News, National Highway Update, Mango News, Mango News Telugu
Highways SOS Box,Where are the life savers?, Notice those boxes on the National Highway,SOS Box

నేషనల్‌ హైవేపై ప్రయాణం చేసేవాళ్లు చాలా మంది రోడ్డు పక్కన అక్కడకక్కడా ఉన్న స్థంభాలకు ఒక బాక్స్‌ను గమనిస్తారు. కానీ అవి ఎందుకున్నాయో అనుకుంటూ ఉంటారు. కానీ ఈ బాక్సుల గురించి అవగాహన పెంచుకోవాలి.  ఎందుకంటే హైవేపై అధికారులు ఏర్పాటు చేసిన ఇది ఎంతోమంది ప్రాణాలను కాపాడటంలో సహాయం చేస్తాయి.

సాధారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు నేషనల్‌ హైవేపైనే  జరుగుతుంటాయి. రోడ్డు చాలా వెడల్పుగా ఉండటం, స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడం, వెహికల్స్ రద్దీ పెద్గగా ఉండకపోవడంతో డ్రైవర్స్ చాలా చాలా స్పీడ్‌గా వెళ్తుంటారు. అందుకే అలాంటి సమయంలోనే  రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.  హైవేపై ప్రమాదం జరిగితే అక్కడ జనాలు ఎక్కువగా లేకపోవడంతో చికిత్స అందక చనిపోవచ్చు. అందుకే నేషనల్ హైవేలపై  ఎవరైనా రోడ్డు ప్రమాదాల బారిన పడితే వారికి తక్షణమే సహాయం అందచేయడానికి రోడ్డుపక్కన కొన్ని బాక్స్‌లను ఏర్పాటు చేస్తుంటారు.

ఆ బాక్స్‌లను ఎస్ఓఎస్ అని పిలుస్తారు. అంటే సేవ్ అవర్ సోల్ అన్నమాట.  జనరల్‌రగా హైవేపై ప్రయాణించినప్పుడు ఈ ఎస్ఓఎస్ బాక్స్‌లను చాలామంది పట్టించుకోరు.  ఈ హెల్ప్‌లైన్‌ బాక్స్‌లు ప్రతి ఒక నేషనల్‌ హైవే మీద ..ప్రతి 300 మీటర్లకో బాక్స్‌ చొప్పున ఏర్పాటు చేస్తారు. ఈ బాక్స్‌ రోడ్డు ప్రమాదం బారిన పడిన వారి ప్రాణాలను కాపాడుతుంది.

మనం హైవేపై వెళ్తుండగా, మనకు ఏదైనా ప్రమాదం జరిగినా.. లేక అక్కడ ఎవరైనా యాక్సిడెంట్‌కు గురైనట్లు గుర్తించినా వెంటనే  రోడ్డు పక్కన ఉండే ఈ బాక్స్‌ వద్దకు వెళ్లాలి. బాక్స్‌పై అక్కడ కనిపించే బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేసి యాక్సిడెంట్‌ జరిగిందన్నట్లు వాయిస్‌‌లో చెప్పాలి. వెంటనే ఆ వాయిస్‌ మెసేజ్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న అంబులెన్స్‌, పోలీస్  స్టేషన్‌, టోల్‌ప్లాజా, ఫైర్‌ స్టేషన్‌లకు వెళ్తుంది.

మన లోకేషన్‌కు చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా వాళ్లకు లోకేషన్‌ వెళ్లిపోతుంది. వెంటనే  అంబులెన్స్‌, పోలీసులు  తక్కువ సమయంలోనే ప్రమాదం జరిగిన  ప్రాంతానికి చేరుకుంటారు. వెంటనే గాయపడ్డవారిని  ఆస్పత్రికి తీసుకెళతారు. ఒక వేళ యాక్సిడెంట్‌ జరిగిన ప్రాంతంలో బాక్స్‌లేకపోతే మీ ఫోన్‌ నుంచి 1033 నంబర్‌కు కాల్‌ చేసినా..తక్షణం సహాయం దొరుకుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 12 =