స్పేస్‌ ఎక్స్‌కు ఎదురుదెబ్బ..

Huge Setback For SpaceX Rocket Explodes Shortly After Launch, Huge Setback, SpaceX Rocket Setback, Elan Musk, Huge Setback For Spacex, Karebian See, Rocket Explodes Shortly After Launch, SpaceX, SpaceX Blasting, America, USA, America News, America Live Updates, National News, International News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నారు. టెస్లా కార్లతో వ్యాపారం మొదలు పెట్టిన మస్క్.. అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరిస్తూ.. ప్రైవేటు వ్యోమ నౌకలు, రాకెట్లు కూడా తయరు చేస్తున్నారు. దీనిలో భాగంగానే 2030 నాటికి అంగారకుడిపై నివాసం ఏర్పాటు చేసుకోవాలన్న టార్గెట్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. దీనికి స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఆధ్వర్యంలో వ్యోమ నౌకలు, రాకెట్లను తయారు చేస్తున్నారు. ఇటీవలే ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి కూడా తీసుకెళ్లారు.

అయితే స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన స్టార్‌షిప్‌ రాకెట్‌ ప్రయోగంలో ఈరోజు విఫలమైంది. ఎనిమిదో పరీక్షలో భాగంగా, టెక్సాస్‌లోని బోకా చికా నుంచి మార్చి 7న ఈ ఉదయం ఈ రాకెట్ గగనంలోకి ఎగిరింది. కానీ అంతరిక్షంలోకి ప్రవేశించిన కొద్ది సమయంలోనే ఆ రాకెట్‌ పేలిపోయి ముక్కలైంది. ఈ పేలుడు శకలాలు దక్షిణ ఫ్లోరిడాతో పాటు బహమాస్‌లోని ప్రాంతాల్లో పడ్డాయి. ఈ సంఘటన వల్ల విమాన సేవలకు కొంతసేపు అంతరాయం కలిగింది. ఈ స్పేస్ ఎక్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ రాకెట్ ప్రయోగం చంద్రుడు, అంగారక గ్రహాలపైకి మానవ సహిత జర్నీల కెపాసిటీని పరీక్షించడానికి, అలాగే డమ్మీ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించినది. అయితే, ఈ ఏడాదిలో రెండో విఫలమైన ప్రయోగంగా మారింది. జనవరి 2025లో జరిగిన స్టార్‌షిప్‌–7 ప్రయోగంలో రాకెట్‌ పేలడంతో..అప్పుడు శకలాలు కరేబియన్‌ సముద్రంలోని టర్క్స్‌ తో పాటు కైకోస్‌ దీవులపై పడ్డాయి.

తాజాగా ఈ స్టార్‌షిప్‌ రాకెట్‌ ఇప్పటివరకు ఎనిమిది పరీక్షలను విజయవంతంగానే ఎదుర్కొంది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన రాకెట్‌గా పేరొందిన స్టార్‌షిప్‌ 123 మీటర్లతో 403 అడుగుల ఎత్తుతో నాసా శాటర్న్‌–V రికార్డును క్రాస్ ఇచ్చింది. దీని నిర్మాణానికి స్పేస్‌ఎక్స్‌ సుమారు 830 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ రాకెట్‌ ప్రయోగం వేగంగా విఫలమై, వేగంగా నేర్చుకోవడం‘ అనే విధానంలో భాగంగా చూస్తున్నామంటూ మస్క్ టీమ్ ట్వీట్ చేసింది.