జాతీయ విద్యా విధానం-2020 కు కేంద్ర కేబినెట్ ఆమోదం

Cabinet approves new National Education Policy, HRD Ministry, HRD Ministry Renamed as Ministry of Education, HRD Ministry renamed Ministry of Education, HRD renamed Ministry of Education, Ministry of Education, national news, PM Modi, Union Cabinet

జూలై 29, బుధవారం నాడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ జాతీయ విద్యా విధానం -2020 ని ఆమోదించింది. అదే విధంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్‌ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చేందుకు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇస్రో మాజీ చీఫ్‌ కె.కస్తూరిరంగన్‌ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నూతన విద్య విధానం ద్వారా దేశంలో పాఠ‌శాల‌, ఉన్న‌త విద్యా వ్య‌వ‌స్థ‌‌లో ప‌రివ‌ర్త‌న‌తో కూడిన సంస్క‌ర‌ణ‌ల‌కు వీలు కలగనుందని చెప్పారు. 6 వ‌త‌ర‌గ‌తి నుంచే ఇంట‌ర్న్‌షిప్‌తో కూడిన వృత్తి విద్య‌, క‌నీసం 5 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మాతృభాష లేదా ప్రాంతీయ భాష‌లో బోధ‌న‌, 15 సంవ‌త్స‌రాల‌లో అఫిలియేష‌న్ వ్య‌వ‌స్థ తొల‌గింపు, క‌ళాశాల‌ల‌కు గ్రేడెడ్ అటాన‌మీ, నేష‌న‌ల్ రిసెర్చ్ ఫౌండేష‌న్ ఏర్పాటు, నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ టెక్నాల‌జీ ఫోర‌మ్‌ను ఏర్పాటుతో పాటుగా పలు అంశాలు జాతీయ విద్యా విధానం-2020 ద్వారా అమలులోకి రానున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 9 =