ఇప్పుడు చాలామంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటివారికి రీడింగ్ గ్లాసెస్‌ను అవసరం లేకుండా సహాయపడే కొత్త కంటి చుక్కల మందుకు డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఓకే చెప్పేసింది. ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ ప్రెస్ బయోపియా ట్రీట్మెంట్ కోసం ఈ కొత్త ఐ డ్రాప్స్‌ను తయారు చేసింది.
వయసు పెరిగే కొద్దీ మనుషుల్లో ప్రెస్ బయోపియా అనే సమస్య తలెత్తడం వల్ల దగ్గరగా ఉన్న వస్తువులను చూడడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది సాధారణంగా 40వ దశకం మధ్యలో మొదలై 60 ఏళ్లు వచ్చినప్పుడు తీవ్రంగా పరిణమిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికే ప్రెస్‌వు ఐ డ్రాప్స్ ను ఉత్పత్తి చేశారు.
ప్రెస్బియోపియా ఉన్నవారిలో రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించడానికి ఇండియాలో తయారైన మొట్ట మొదటి చుక్కల మందు ఇది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఉత్పత్తిని ముందుగా సిఫార్సు చేసిన తర్వాత ENTOD ఫార్మాస్యూటికల్స్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తుది ఆమోదం పొందింది.
ENTOD ఫార్మాస్యూటికల్స్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తుది ఆమోదం పొందింది. తయారీదారులు ఈ ప్రత్యేకమైన ఫార్ములా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. యాజమాన్య ఫార్ములా కేవలం రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తొలగించడమే కాకుండా కళ్లను లూబ్రికేట్ కూడా చేస్తుంది.ఈ కంటి చుక్కల మందు అధునాతన డైనమిక్ బఫర్ సాంకేతికతను కలిగి ఉంటాయి.
ఈ డ్రాప్స్‌ను సంవత్సరాలుగా ఉపయోగించవచ్చు. 40 ఏళ్లు పైబడిన వారికి ఇది చాలా మంచి ఔషధం.దీని ద్వారా మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరచవచ్చు. అక్టోబర్ మొదటి వారం నుంచి, ప్రిస్క్రిప్షన్ ఆధారిత కంటి చుక్కలు 350 రూపాయలధరతో ఫార్మసీలలో అందుబాటులో ఉంటాయి.