అప్ఘనిస్తాన్, ఇరాన్‌లలో జరిగిన సంఘర్షనల్లో అమెరికా చేసిన తప్పుల్ని బహిర్గతం చేసి వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు అసాంజేకు ఊరట లభించింది. గూఢచార్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లు బ్రిటన్‌లో తలదాచుకున్న ఆయన్ను విడిచిపెట్టాలని అమెరికా న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. అంతకంటే ముందు మూడు గంటల పాటు అసాంజేను కోర్టులో విచారించారు. అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందేందుకు.. వాటిని బహిర్గతం చేసేందుకు కుట్ర పన్నానని అసాంజే కోర్టు ఎదుట అంగీకరించారు.
యూఎస్‌కు చెందిన ఉత్తర మారియానా ద్వీపం రాజధాని అయిన సైపన్‌లో ఉన్న కోర్టులో అసాంజేను విచారించారు. అమెరికాకు రావడానికి అసాంజే నిరాకరించడంతో అక్కడ విచారణ జరిపారు. విచారణలో భాగంగా అసాంజే.. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్ని తాను విశ్వసిస్తానంటూ పరోక్షంగా తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. బావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా.. రహస్య పత్రాలను సేకరించి, ప్రచురించినట్లు కోర్టు ఎదుట వెల్లడించారు. అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని తాను అంగీకరిస్తున్నట్లు అసాంజే స్పష్టం చేశారు.
అయితే జూలియన్ అసాంజే నేరాన్ని అంగీకరించడాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జస్టిస్ రమొననా వి. మంగోవా ఆమోదించారు. ఈ మేరకు అసాంజే బ్రిటన్‌లో గడిపిన నిర్భంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ విడుదల చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పుతో అసాంజే యూకే, యూఎస్‌లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి ప్రత్యేక విమానంలో కాన్‌బెర్రాకు వెళ్లారు. ఈ కేసులో అసాంజే విడుదలన ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ స్వాగతించారు. ఈ కేసులో సానుకూల పరిణామం కోసం తమ ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశామని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE