మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నవేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అందరూ ఊహించిందే నిజయింది. డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో బైడెన్ ఘో వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బైడెన్ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు బైడెన్ కృతజ్ఙతలు తెలియజేశారు. అలాగే ఆమె అభ్యర్థిత్వానికి మద్ధతు పలికారు. వచ్చే నె షికాగోలో జరిగే డెమోక్రటిక్ జాతీయ సదస్సులో తదుపరి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. అయితే కమలా హారిస్‌కు బైడెన్ మద్ధతు ఉండడంతో.. దాదాపు ఆమెనే ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినీగా తనకు మద్దతు పలికినందుకు బైడెన్‌కు కమలా హారిస్ ధన్యవాదాలు తెలిపారు. దేశ అధ్యక్షుడిగా బైడెన్ అద్భుతమైన సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు నిజాయతీ, దేశభక్తి, చిత్తశుద్ధి, సహృదయం వంటి లక్షణాలను బైడెన్‌లో చూశానని పేర్కొన్నారు. ఏడాదికాలంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని.. ఎన్నికల్లో ఎవరివైప ఉండాలో ప్రజలకు వివరిస్తున్నానని కలా హారిస్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రాజెక్ట్ 2025ని ఓడించేలా దేశాన్ని ఏకం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతానని.. కచ్చితంగా ఆయన్ను ఓడించి తీరుతానని అన్నారు. కచ్చితంగా గెలుపు తమదేనని కమలా హారిస్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థి అయితే ఆమెను ఓడించడం మరింత సులభం అవుతుందని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కచ్చితొంగా ఆమెను ఓడించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి జో బైడెన్ తగిన వ్యక్తి కాదని.. ఆ హోదాలో పనిచేసే అర్హత ఆయనకు ఏనాడూ లేదన్నారు. బైడెన్ కేవలం అబద్ధాలు, తప్పుడు సమాచా వ్యాప్తి ద్వారా అధ్యక్ష పదవిని పొందారని పేర్కొన్నారు. ఆయన పాలన వల్ల భవిష్యత్తులో అమెరికా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని .. వాటిని వీలైనంత త్వరగా చక్కబెడతానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE