ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్

WHO Says New Covid-19 Variant Omicron Detected In 38 Countries,Covid B.1.1.529 variant, covid-19 new variant, Mango News, MangoNews, New Coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, New COVID-19 Variant Omicron Now In 38 Countries, New COVID-19 Variant Omicron Now In 38 Countries Says WHO, Omicron, Omicron covid variant, Omicron In India, Omicron Now In 38 Countries, Omicron variant, omicron variant in India, omicron variant south africa, Update on Omicron, who

ప్రపంచ దేశాలని ఒణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్… తాజాగా మరి కొన్ని దేశాలలో తన పంజా విసిరింది. తాజాగా అమెరికాలోని 5 రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్క రోజే న్యూయార్క్ లో 5 కేసులు వెలుగు చూడటం గమనార్హం. ఒమిక్రాన్ వేరియెంట్.. డెల్టా వేరియెంట్ కన్నా 6 రేట్లు వేగంగా వ్యాప్తిచెందుతున్నట్లు వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకనగా, ఒమిక్రాన్ వేరియెంట్ అతి వేగంగా అనేక ఉత్పరివర్తనాలను సంతరించుకుంటూ వెళ్తుండటం ముఖ్య కారణంగా వారు భావిస్తున్నారు. దీని వలన అది వేగంగా, సమర్ధవంతంగా వ్యాప్తిచెందుతున్నట్లు చెప్తున్నారు. దీనిపై వాక్సిన్ ప్రభావం కూడా అంతగా ఉండటం లేదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ విధమైన వాక్సిన్ కూడా దీనిని సమర్ధవంతంగా అడ్డుకోలేకపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మలేసియాలో నిన్న తొలిసారిగా ఒక ఒమిక్రాన్ కేసు నమోదయింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒక విదేశీయురాలికి పరీక్షలు నిర్వహించగా ఇది బయటపడింది. తనతోపాటుగా వచ్చిన మరో నలుగురిని క్వారంటైన్ కి పంపించి వారికి కూడా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు అక్కడి వైద్యశాఖ వర్గాలు తెలియచేశాయి. సౌత్ కొరియాలో కూడా ఒమిక్రాన్ కేసులు 6కి పెరిగాయి. సింగపూర్ దేశంలో కూడా క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నిన్న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ లక్షణాలు వెలుగు చూసినట్లు తెలిసింది. వీరిని ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఒమిక్రాన్ తొలిసారిగా వెలుగు చూసిన దక్షిణాఫ్రికా దేశానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సాయానికి ముందుకొచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + one =