కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కొలువుదీరబోతోంది. ఈనెల 9న నరేంద్ర మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈక్రమంలో శుక్రవారం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో ఎన్డీయే కూటమి ఎంపీలు, ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎన్డీయే పక్షనేతగా మోడీ పేరును ప్రతిపాదించారు. ఆయను పేరును అమిత్ షా, నితిన్ గడ్కరీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి బలపరిచారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు అందివచ్చిందని అన్నారు. ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోడీ ఎంతగానో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. ఏపీలో నిర్వహించిన 3 బహిరంగ సభలు.. ర్యాలీల్లో మోడీ పాల్గొన్నారన్నారు. రాష్ట్రంలో 90 శాతం స్థానాలను గెలుచుకున్నామని చెప్పుకొచ్చారు. దూరదృష్టి కలిగిన మోడీ.. భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని.. భారత్ అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. విజనరీ నాయకుడు మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుందని వివరించారు.
మేకిన్ ఇండియాతో మోడీ భారత్‌ను వృద్థిపథంలో నడిపారని.. ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారన్నారు. మోడీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ నంవబర్ వన్‌గా నిలుస్తుందని.. దేశం పేదరిక రహితంగా మారుతుందని చంద్రబాబు వెల్లడించారు. అటు విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రధాని మోడీ నాయకత్వానికి జనసేన పూర్తి మద్ధతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదని.. మోడీ నేతృత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY