మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రముఖ బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఈ మేరకు పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అలాగే ఎన్సీపీ తన అధికారిక ట్విట్టర్‌లో కూడా తెలియజేసింది. శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించిందని, అయితే ఆసుపత్రి నుంచి ఆయన బుధవారం (నవంబర్ 2న) డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా శరద్ పవార్ నవంబర్ 4-5 తేదీల్లో షిర్డీలో నిర్వహించనున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించింది.
राष्ट्रवादी काँग्रेस पक्षाचे राष्ट्रीय अध्यक्ष आदरणीय शरद पवार साहेब यांची प्रकृती ठीक नसल्यामुळे पुढील तीन दिवस पवार साहेबांना मुंबईतील ब्रीज कॅन्डी रुग्णालयात उपचारासाठी दाखल करण्यात येणार आहे. #NCP pic.twitter.com/YpjqjcFw1E
— NCP (@NCPspeaks) October 31, 2022
అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో నవంబర్ 8న ఆయన పాల్గొంటారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు, కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్‌లను కలిశారని, రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో పాల్గొనాల్సిందిగా తనకు ఆహ్వానం అందజేశారని పవార్ తెలియజేశారు. కాగా, శరద్ పవార్ గతంలో గత సంవత్సరం ఏప్రిల్ 11న కూడా ఆసుపత్రిలో చేరారు. ఆ మరుసటి రోజు ఆయనకు గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయనకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE