ఇటీవల బర్డ్ ఫ్లూ భయం కొద్దిగా తగ్గినప్పటికీ, ఇప్పుడు కొత్తగా FPV (Feline Panleukopenia Virus) అనే ప్రాణాంతక వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ ముఖ్యంగా పిల్లులను ప్రభావితం చేస్తూ, వారి ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. ఇంట్లో పెంపుడు పిల్లులను పోషించే వారందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత నెలలో అక్కడ వందకు పైగా పిల్లుల్లో FPV ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు.
వైరస్ ప్రభావం
FPV వైరస్ బహుళంగా వ్యాపించే లక్షణం కలిగి ఉంది. ఒకే సమూహంలో ఒక పిల్లికి సోకితే, మరికొన్ని సెకన్లలో అది సమీపంలోని పిల్లులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. వైద్యులు చెబుతున్న ప్రకారం, ఈ వైరస్ సోకిన పిల్లుల బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 100 కేసులలో 99 పిల్లులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ వీధి పిల్లులకే కాకుండా, ఇంట్లో పెంచే పెంపుడు పిల్లులకు కూడా సోకుతుంది.
లక్షణాలు & చికిత్స
FPV వైరస్ మూడు దశలుగా లక్షణాలను ప్రదర్శిస్తుంది. మొదటి దశలో వాంతులు, విరేచనాలు, నిర్జలీకరణం కనిపిస్తాయి. రెండవ దశలో పిల్లులకు తీవ్రమైన జ్వరం వస్తుంది. మూడవ దశలో నీరసం, అలసటతో పిల్లులు పూర్తిగా క్షీణించిపోతాయి. కరోనా వైరస్ లాగే, FPV కు ప్రత్యేకమైన చికిత్స అందుబాటులో లేదు. కేవలం లక్షణాలను ఆధారంగా చికిత్స అందించాల్సి ఉంటుంది.
FPV వైరస్ మానవులకు, కుక్కలకు పెద్దగా హాని కలిగించదని ఎడిన్‌బర్గ్ పశువైద్య నిపుణులు తెలిపారు. అయితే, ఇంట్లో పిల్లులను పెంచేవారు శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. చేతులు, దుస్తులు, బూట్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశముండట.