
రెండుసార్లు కేంద్ర మంత్రిగా పని చేసిన నిర్మలా సీతారామన్ మరోసారి రికార్డు క్రియేట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్‌లో ఆదివారం సాయంత్రం నిర్మలా సీతారామన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత ప్రధాని మోడీ మంత్రివర్గంలో స్థానం సంపాదించడం వల్ల.. వరుసగా మూడోసారి కేంద్రమంత్రిగా కేబినెట్‌లో చేరిన ఏకైక మహిళా మంత్రిగా తాజాగా నిర్మలా సీతారామన్ నయా రికార్డు దక్కించుకున్నట్లు అయింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ప్రభుత్వ హయాంలో నిర్మలా సీతారామన్ కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ముఖ్యంగా రెండోతరం ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంతో నిర్మలా సీతారామన్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 2014లో తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రిగా చేసిన నిర్మలా సీతారామన్.. 2017లో ముందుగా రక్షణ శాఖ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలు జరిగాక.. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం పాలవగా.. పూర్తిస్థాయి ఆర్థిక మంత్రి అయిన మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డులకెక్కారు.
అంతకుముందు స్వర్గీయ ఇందిరా గాంధీ.. భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. స్వల్ప కాలానికి ఆర్థిక శాఖను కూడా నిర్మలా సీతారామన్ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకున్నారు. తెలుగింటి ఆడపడుచుగా పిలుచుకునే నిర్మలా సీతారామన్ ఇలా దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంటూ ముందుకు సాగడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY