హెచ్ 1 బీ వీసాలతో భారత ఐటీ రంగం భారీగా డెవలప్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా జారీ చేసే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి లెక్కలు విడుదల చేసింది. అమెరికా జారీ చేసే ప్రతీ ఐదు హెచ్ 1 బీ వీసాల్లో ఒకరు భారతీయులే ఉంటున్నారని ఆ లెక్కల ద్వారా తెలుస్తోంది.అమెరికా కంపెనీలు తాత్కాలికంగా ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్ 1 బీ వీసాలను జారీ చేస్తూ ఉంటుంది.
ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాకు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్లేవారికి అమెరికా ప్రభుత్వం రకరకాల వీసాలు జారీ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం హెచ్ 1 బీ వీసాల గురించి బాగా చర్చ జరుగుతోంది. ఇక ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వెళ్లేవారిలో భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో ఉంటారు. నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు.. తాత్కాలికంగా హెచ్ 1 బీ వీసాలు అందిస్తూ ఉంటుంది.
అమెరికా జారీచేసే హెచ్1బీ వీసాల్లో భారత ఐటీ కంపెనీలు దూకుడు చూపిస్తున్నాయి. మొత్తం హెచ్1బీ వీసాల్లో అయిదింట ఒకవంతు మన సంస్థలే దక్కించుకున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం గణాంకాల విశ్లేషణ ప్రకారం…హెచ్1బీ వీసాలు పొందడంలో ఇన్పోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ప్రక్రియలో ముందున్నాయి. 2024 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య అమెరికా జారీచేసిన 1.3 లక్షల హెచ్1బీ వీసాల్లో 24, 766 వీసాలను భారత సంతతి కంపెనీలే పొందాయి.
ఇక అత్యధిక వీసాలు పొందిన వాటిలో అమెజాన్ కామ్ సర్వీసెస్ ఎల్ఎల్ సీ ముందుంది. ఈ సంస్థకు 9,265 వీసాలు లభించాయి. దీని తర్వాత స్థానం ఇన్పోసిస్ దే. న్యూజెన్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ 6,321 వీసాలతో మూడో స్థానంలో నిలిచింది. భారత సంస్థల్లో …8,140 వీసాలతో ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎస్ 5,274, హెచ్సీఎల్ అమెరికా 2,953 వీసాలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈసారి విప్రో 1,634 వీసాలు, టెక్ మహింద్రా 1,199 వీసాలతో కొంచెం వెనుకబడ్డాయి.