డిసెంబర్ 1 నుండి మొదలవనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Parliament Winter Session Scheduled From Dec 1 To 19, Announces Minister Kiren Rijiju

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాల‌కు సిద్ధమైంది. ఈ సమావేశాలు డిసెంబ‌ర్ ఒక‌ట‌వ తేదీ నుంచి ప్రారంభమై, డిసెంబ‌ర్ 19 వ‌ర‌కూ కొనసాగనున్నాయి. ఈ మేరకు సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు విష‌యాన్ని కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు శ‌నివారం నాడు ధృవీకరించారు.

‘పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌కు లోబ‌డి డిసెంబ‌ర్ 1 నుంచి 19 వ‌ర‌కూ పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు’ అని మంత్రి రిజిజు ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు. కాగా, ఈ 19 రోజుల పాటు దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు, కొత్త బిల్లుల ఆమోదం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.

దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు జరపడం, కొత్త బిల్లులను ఆమోదించడం, పాత బిల్లులపై సమీక్ష చేపట్టడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన బిల్లులను సిద్ధం చేసింది. వివిధ సమస్యలపై చర్చల కోసం ప్రతిపక్షాలకు తగిన సమయం కేటాయించడం జరుగుతుంది.కీలకమైన చట్టపరమైన, పాలనాపరమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here