పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం.. సభ 28కి వాయిదా, ఆరోజే ఓటింగ్?

No-Trust Vote on PM Imran Khan in Pakistan Parliament House Adjourned Till March 28, No-Trust Vote on PM Imran Khan in Pakistan Parliament, Pakistan Parliament House Adjourned Till March 28, No-Trust Vote on PM Imran Khan, PM Imran Khan, Imran Khan, Prime Minister of Pakistan, Imran Khan Prime Minister of Pakistan, Prime Minister Imran Khan, Pakistan Parliament House, Pakistan Parliament, Pakistan Parliament Latest News, Pakistan Parliament Latest Updates, No-Trust Vote, Mango News, Mango News Telugu,

పాకిస్థాన్ మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై పాకిస్థాన్‌ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండానే జాతీయ అసెంబ్లీ శుక్రవారం వాయిదా పడింది. సభ మార్చి 28న మళ్లీ సమావేశం కానుంది. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో తమ పక్షాలకు తగిన సంఖ్యాబలం ఉందని ఇరుపక్షాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ ప్రతిపక్ష నాయకులు షెహబాజ్ షరీఫ్, బిలాల్వాల్ భుట్టో-జర్దారీ మరియు ఆసిఫ్ అలీ జర్దారీ పార్లమెంట్ హౌస్‌కు హాజరయ్యారు. తిరుగుబాటుదారులను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీమ్ కోర్టుకు ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన నాయకులను పదవి నుండి అర్ధాంతరంగా తొలగించటం పాకిస్థాన్ దేశంలో సర్వసాధారణం.

అయితే, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ 2018లో జాతీయ అసెంబ్లీలో స్వల్ప మెజారిటీతో ఎన్నికైనప్పటికీ అతను తన పదవీకాలం పూర్తి చేసే అవకాశం ఉంది. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యక్తిగతంగా ప్రజలలో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్ శక్తివంతమైన సైన్యం యొక్క స్పష్టమైన మద్దతు ఉంది. అయితే ఆయన పరిపాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇమ్రాన్ అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్థాన్ రూపాయి దాదాపు సగం విలువ కోల్పోయింది. కానీ, చాలా మంది సీనియర్ నేతలపై అవినీతి కేసులతో ప్రతిపక్షం కూడా చీలిపోయి గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలో.. మార్చి 28న (సోమవారం) అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిలో ఇమ్రాన్ తన బలాన్ని చాటుకుంటాడా? లేదంటే, పదవిని కోల్పోతాడా? అనేది సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 9 =