పారాలింపిక్స్ లో ఫైనల్ చేరిన భవీనా పటేల్ కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi Congratulates Bhavina Patel for her Performance at Paralympics,PM Modi Congratulates Bhavina PatelPM Modi Congratulates Bhavina Patel for her Performance at Paralympics,PM Modi Congratulates Bhavina Patel

టోక్యో పారాలింపిక్స్-2020 లో భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవీనా పటేల్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “భవినా పటేల్‌ కు అభినందనలు! అద్భుతంగా ఆడారు. రేపటి మీ విజయం కోసం దేశం మొత్తం ప్రార్థిస్తోంది. మీ వంతు కృషి చేయండి మరియు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడండి. మీ విజయాలు మొత్తం దేశానికి స్ఫూర్తినిస్తాయి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ముందుగా శనివారం నాడు పారాలింపిక్స్ లో మహిళల టేబుల్ టెన్నిస్‌ క్లాస్ -4 సింగిల్స్ విభాగం సెమీఫైనల్లో భవినా సంచన విజయం సాధించింది. చైనాకు చెందిన ప్రపంచ నెం.3 ర్యాంకు క్రీడాకారిణి జాంగ్‌ మియావోపై 3-2 తేడాతో విజయం సాధించి, పారాలింపిక్స్‌లో భారత్‌ కు పతకాన్ని ఖరారు చేసింది. అలాగే పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో ఫైనల్‌ లోకి ప్రవేశించిన మొదటి భారతీయురాలిగా భవీనా పటేల్ చరిత్ర సృష్టించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ