సెక్యులర్ అనే పదము ఎప్పుడు వాడని బీజేపీ పార్టీ స్వాతంత్ర్య దినోవ్సవ వేడుకల్లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ నే సెక్యులర్ అనే పదాన్ని వాడటం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. అసలు ఈ దేశంలో సెక్యులర్ అనే పదం వినిపించకూడదు అని వాదించే బీజేపీ ఇప్పుడు రూటు మార్చడానికి కారణం ఏమయి ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎన్డీయో కూటమితో కలిసి అధికారం ఏర్పాటు చేసినప్పటికీ… క్రితం సారి ఎన్నికల కంటే ఈ సారి ఆ పార్టీకి గణనీయంగా సీట్లు తగ్గాయి. హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్లిన బీజేపీకి గత ఎన్నికల్లో భారీగా దెబ్బ పడినట్లయింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ సీటులో బీజేపీ ఓటమిని చవిచూసింది. ఇటీవల బద్రీనాథ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. దీంతో ఇన్నాళ్లు అగ్రెసివ్ గా హిందుత్వ ఎజెండా తో ముందుకు వెళ్లిన బీజేపీ ఈ ఓటములతో తన పంథా మార్చుకుందని అందరు అనుకుంటున్నారు.
తాగాజా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడి మరోసారి యునిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రస్థావించకుండా సెక్యులర్ సివిల్ కోడ్ అని అన్నారు. బీజేపీ తన మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూలకు ఇబ్బందులు కలగకుండా ఉండేదుకే యూనిఫామ్ సివిల్ కోడ్ అని అనకుండా సెక్యులర్ సివిల్ కోడ్ అని ప్రస్తావించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్డీయో కూటమిలో ఉన్న పార్టీలకు వెసలుబాటు కలిగించేలా… సెక్యులర్ సివిల్ కోడ్ అని మోడి ప్రస్తావించినప్పటికి బీజేపీ ఉద్దేశ్యంలో మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటుందని మైనార్టీలు విమర్శించే అవకాశం లేకపోలేదు. నరేంద్ర మోడి సెక్యులర్ సివిల్ కోడ్ అని ప్రస్తావించినప్పటికి కాషయం సివిల్ కోడ్ అని ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశముంది. ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో ఈ అంశం వివాదంగా మారి తమకే అనుకూలంగా ప్రయోజనాలు చేకూర్చే అవకాశముందని బీజేపీ భావిస్తోంది.
తాము సెక్యులర్ సివిల్ కోడ్ కి మద్దతు తెలుపుతున్న ప్రతిపక్షాలు, ముస్లీం మత పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. తాము మైనార్టీ, మెజార్టీ అనడం లేదు సెక్యులర్ అని అంటున్న కూడా వ్యతిరేకిస్తున్నారని బీజేపీ కౌంటర్ అటాక్ చేసి అవకాశముంది. ఎంఐఎం పార్టీలో పాటు పలు ముస్లీ మతవాద సంస్థల గళం విప్పడాన్ని ప్రస్తావిస్తూ మెజార్టీ ల మద్దతు కూడగట్టుకోవడం బీజేపీ స్కెచ్. అటు మిత్రపక్షాలకు ఇబ్బంది కలగకుండా తనకు రాజకీయ ప్రయోజనాలు కలిగేలా బీజేపీ పక్కా స్ట్రాటజీతోనే సెక్యులర్ సివిల్ కోడ్ అంశాన్ని ప్రస్తావించారని రాజకీయ పండితులు విశ్లేషణలు చేస్తున్నారు.