భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని పీఎంఓ ఆఫీస్‌లో ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రైతుల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తూ తన తొలి సంతకాన్ని చేశారు. 17వ విడత పీఎం కిసాన్ నిధి విడుదల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. దీనిద్వారా దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్ల ఆర్థికసాయం అందనుంది. త్వరలోనే ఈ నిధులు రైతుల ఖాతాల్లో పడనున్నాయి.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం రైతుల సంక్షేమానికి సంబంధించిన ఫైల్‌పైనే చేశానని వెల్లడించారు. రానున్న రోజుల్లో వ్యవసాయరంగానికి, కర్షకుల సంక్షేమంపై తమ ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తుందని మోడీ వివరించారు. పీఎం కిసాన్ నిధి పథకం వల్ల 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు.
ఇక సోమవారం సాయంత్రం 5 గంటలకు లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో మోడీ అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీ చేత ప్రమాణం చేయించారు. అలాగే మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న 71 మంది కూడా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి మోడీ కేబినెట్‌లో చోటు దక్కింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY