దశాబ్ధమంతా వానలు..ఎండలే :భారత్‌పై డబ్ల్యూఎంవో రిపోర్ట్

The highest temperatures of the entire decade,The highest temperatures,Temperatures of the entire decade,WMO Report,The highest temperatures ,Entire decade, WMO Report on India, Heat Waves, Floods,Mango News,Mango News Telugu,WMO Report Latest News,WMO Report Latest Updates,Highest temperatures News Today,Temperatures of decade Latest News,Heat Waves Latest News
WMO Report,The highest temperatures ,entire decade, WMO Report on India, Heat Waves, Floods,

వాతావరణ మార్పులపై దుబాయ్‌లో జరిగిన సమావేశంలో.. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఓ రిపోర్టును విడుదల చేసింది. గత దశాబ్ధం అంటే 2011 నుంచి 2020 వరకు.. ఇండియాలో వాతావరణ మార్పులలో చాలా ప్రభావం కనిపించినట్లు రిపోర్టులో తెలిపారు. కొన్నేళ్లు వర్షాలు, కొన్నేళ్లు ఎండలు దంచి కొట్టినట్లు ఆ నివేదికలో తేలింది. అయితే ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం.. 2011 నుంచి 2020 వరకు అత్యధిక స్థాయిలో టెంపరేచర్ నమోదయినట్లు తెలిపింది. అయితే  కాప్‌28 సమావేశంలో కూడా ఇదే  విషయాన్ని వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే.

గతేడాది వాయవ్య భారత్‌,చైనా, పాకిస్థాన్,అరేబియా దీవుల్లోని దక్షిణ భాగాల్లో తడి వాతావరణం గల పరిస్థితులు నెలకొన్నట్లు డబ్ల్యూఎంవో తన రిపోర్టులో చెప్పింది. ఈ ప్రదేశాల్లో వెట్ డికేడ్ నమోదు అయినట్లు నివేదిక చెప్పింది. అంతేకాదు  2011 నుంచి 2020 వరకు.. వేడి వాతావరణం కూడా చాలా ఎక్కువగా నమోదు అయినట్లు గుర్తించింది. 1961 నుంచి 1990 వరకు పోలిస్తే.. ఈశాన్య ఆసియా, మెక్సికో, యూరోప్, ఆస్ట్రేలియా , దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మాత్రమే వేడి వాతావరణం రెట్టింపు అవగా ఇప్పుడు ఆ లిస్టులోకి వాయవ్య భారత్‌,చైనా, పాకిస్థాన్,అరేబియా దీవులు చేరిపోయాయి .

ప్రపంచవ్యాప్తంగా ఉష్టోగ్రతలు పెరగడంతో.. అతి శీతల వాతావరణ పరిస్థితులు అనేవి లేకుండా పోయినట్లు కనిపిస్తోందని నివేదికలో తెలియజేశారు.  గత దశాబ్ధంలోని అతి శీతల రాత్రులను .. 1961-90తో పోలిస్తే 40 శాతం పడిపోయినట్లు నివేదికలో వెల్లడించారు. 2013లో భారత్‌లో రుతుపవనాల వల్ల చాలా నష్టం  జరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఆ ఏడాది కురిసిన వర్షాల వల్ల హిమాలయ ప్రాంతాల్లో తీవ్ర వరదలు వచ్చాయని రిపోర్టులో తేలింది. వర్షాలు, మంచుచరియలు కరిగిపోవడం వల్ల వరదలు వచ్చినట్లు నివేదికలో తెలిపారు. అంతేకాదు 2018, 2019, 2020లో వచ్చిన ఫ్లడ్స్ వల్ల కేరళలో తీవ్ర నష్టం జరిగినట్లు నివేదిక గుర్తు చేసింది.

2011 నుంచి 2020 వరకు ఇండియాలో నెలకొన్న కరవు కూడా రిపోర్టులో నమోదయ్యింది. 2011లో ఏకంగా 28 రాష్ట్రాల్లో కరవును ప్రకటించడంతో.. తీవ్ర ఆహార, నీటి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరంలో పంటలు ఎండిపోవడంతో  ఎక్కువ శాతం  మంది ప్రభుత్వ ఆహార సరఫరా వ్యవస్థపైనే ఆధారపడవలసి వచ్చింది. ఆ సమయంలో కరవు ప్రాంతాల్లో సుమారు 82 శాతం ఇళ్లల్లో ఆహార అభద్రత ఏర్పడినట్లు నివేదికలో తెలిపారు.

2001-2010 దశాబ్ధంతో కనుక  2011-2020ను పోలిస్తే.. అంటార్కిటికాలో 75 శాతం మంచు గడ్డలు కరిగిపోయినట్లు నివేదికలో తేలింది. గత దశాబ్ధంలో చాలా వరకు దేశాల్లో ఎక్కువ స్థాయిలో టెంపరేచర్లు నమోదయినట్లు డబ్ల్యూఎంవో తెలిపింది. సముద్రాల్లో విపరీతంగా  వేడి  పెరుగుతోందని, సముద్ర నీటి మట్టం కూడా  అంచనాలకు అందని  వేగంతో పెరుగుతున్నట్లు చెప్పింది.  2011-2020లో హీట్‌వేవ్స్ వల్ల ఎక్కువ సంఖ్యలో  మరణాలు రిపోర్టు అయ్యాయి.అయితే 2021-2030 ను కి చేరేసరికి ఈ ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు నివేదిక తేల్చి చెప్పింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eleven =