మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో 113వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి సరైన అవకాశం, మార్గదర్శకత్వం అవసరమని అన్నారు. ఈ సందర్భంగా, ఈ రోజు మరోసారి దేశం సాధించిన విజయాలు , దేశ ప్రజల సమిష్టి కృషి గురించి మాట్లాడుతామని ప్రధాని మోదీ అన్నారు. 21వ శతాబ్దపు భారతదేశంలో చాలా జరుగుతున్నాయన్నారు. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క పునాదిని బలోపేతం చేస్తోందన్నారు. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లోకి రావడానికి సుముఖంగా ఉన్నారని మోడీ పేర్కొన్నారు. వారికి కావాల్సిందల్లా సరైన అవకాశం, మార్గదర్శకత్వం మాత్రమేనని పేర్కొన్నారు.
రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానం చేయాలని స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఎర్రకోట నుంచి పిలుపునిచ్చానన్నారు. కాగా దీనిపై విపరీతమైన స్పందన వచ్చిందని మోడీ పేర్కొన్నారు. దీన్ని బట్టి రాజకీయాల్లోకి రావడానికి యువత ఎంత సిద్ధంగా ఉన్నారో అర్థమవుతుంది. వారు సరైన అవకాశం, సరైన మార్గదర్శకత్వం కోసం చూస్తున్నారని ప్రస్తావించారు. కుటుంబ రాజకీయాలు కొత్త ప్రతిభను అణచివేస్తాయని పలువురు తనకు తెలిపారని అన్నారు. స్వాతంత్య ఉద్యమంలో రాజకీయ నేపథ్యంలేని అన్ని వర్గాలు పాల్గొన్నాయని అన్నారు. వారందరూ దేశం కోసం త్యాగాలు చేశారన్నారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఆ స్ఫూర్తే కావాలన్నారు. ఈ అంశంపై సూచనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మన సమిష్టి కృషితో రాజకీయ నేపథ్యం లేని యువత కూడా రాజకీయాల్లో ముందుకు రాగలరని అన్నారు. రాజకీయాల్లో యువత అనుభవం, ఉత్సాహం దేశానికి ఉపయోగపడతాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
అంతరిక్ష సాధనకు ప్రశంసలు
చంద్రుడిపై భారత్ అడుగుపెట్టిన సందర్భంగా ఆగస్టు 23న జరుపుకునే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. త సంవత్సరం, ఈ రోజున, చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగమైన శివ-శక్తి బిందువుపై విజయవంతంగా ల్యాండ్ అయిందన్నారు. స్పేస్ స్టార్టప్‌లకు నాయకత్వం వహిస్తున్న అనేక మంది యువ పారిశ్రామికవేత్తల పనితీరుతో పాటు దేశంలో అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష వ్యవస్థను ఆయన అభినందించారు.
కాగా హర్ ఘర్ తిరంగా ప్రచారం యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపించిందని ప్రధాని మోడీ అన్నారు. ఈసారి ఈ ప్రచారం పతాక స్థాయికి చేరుకుందన్నారు. దేశంలోని నలుమూలల నుండి ఈ ప్రచారానికి విపరీతమైన స్పందన వచ్చింది ఇళ్లపై సహా అన్నిచోట్ల త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడం చూశాం. ఈ ప్రచారం యావత్ దేశాన్ని ఒకదానితో ఒకటి ముడిపెట్టిందని ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని అన్నారు. మోడీ తన ప్రసంగంలో అస్సాంలోని టీన్సుకియా ప్రాంతం గురించి ప్రస్తావించారు. అరుణాచల్ ప్రదేశ్లోని యువత జంగువులపై ప్రేమగో వాడుతున్న సరికొత్త త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ గురించి కూడా మాట్లాడారు. మధ్యప్రదేశ్లోని బులోని పారిశుధ్మ కార్మికులను ప్రశంసించారు.