దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ విధించిన ఎమర్జెన్సీ మార్షల్ లా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకతను చవి చూసింది. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో తీర్మానం చేసి ఎమర్జెన్సీని వ్యతిరేకించడంతో, వెంటనే యోల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. 190-0 ఓట్లతో తీర్మానం ఆమోదించబడిన నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, తాను చేసిన తప్పును అంగీకరించి దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. మార్షల్ లా వల్ల ప్రజలు అనుభవించిన అసౌకర్యంపై ఆయన చింతాభావాన్ని వ్యక్తం చేశారు.
అభిశంసన తీర్మానం తో ఒత్తిడిలో అధ్యక్షుడు
మార్షల్ లా నిర్ణయంపై వ్యతిరేకతతో ఇప్పటికే దక్షిణ కొరియా పార్లమెంట్లో అభిశంసన తీర్మానం కోసం ఓటింగ్కు సిద్ధమవుతోంది. 300 మంది సభ్యులలో 200 మంది అనుకూల ఓటు వేస్తేనే యోల్ తన పదవిని నిలబెట్టుకోగలరు. ప్రతిపక్షాల బలమైన మద్దతుతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందే అవకాశం కనిపిస్తోంది. ప్రజలలో నమ్మకం తిరిగి పొందేందుకు మార్షల్ లా నిర్ణయం పునరాలోచన చేసి, ఇకపై ప్రజాస్వామ్య పద్ధతులు పాటిస్తానని యోల్ హామీ ఇచ్చారు.