
దాదాపు 46 ఏళ్ల తర్వాత నిన్న అంటే జులై 14న పూరీ జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరిచారు. ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు చెక్కపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత దానిని తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై ఎన్నో వివాదాలు కొనసాగాయి. అసలు రత్న భాండాగారం తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో అంశమైంది. చివరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలోని ఖజానా ఉన్న భాండాగారాన్ని తెరిచారు.
అయితే పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపు ప్రక్రియను ప్రస్తుతం అధికారులు నిలిపివేశారు. బయటి రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలను తాము తరలించామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. అయితే ఆలయం లోపల రత్న భాండాగారం తెరుచుకోకపోవడతో దాని తాళాలు పగలగొట్టి తెరిచినట్లు అధికారులు చెప్పారు. లోపల రత్న భాండాగారంలో ఆభరణాలన్నిటినీ భద్రంగా అల్మారాలు, లాకర్లలో పెట్టారు. వాటిలోని ఆభరణాలు తరలించడానికి సమయం సరిపోదని తెలిపారు. ఈరోజు అంటే జులై 15న పూరీ జగన్నాథుడి రథయాత్ర తిరుగు ప్రయాణం ఉండటంతో ఆభరణాల తరలింపు ప్రక్రియను ఆపేసినట్లు అధికారులు చెప్పారు. మరోసారి దీనిపై హైలెవెల్ కమిటీ భేటీ అయిన తర్వాత.. ఒక సమయం నిర్ణయించుకుని లోపల రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపును అధికారులు చేపడతామని పేర్కొన్నారు. బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారి.. పూరీ జగన్నాథుడి క్షేత్రంలో రత్న భాండాగారంలోని ఖజానాలో మణి రత్నాలు పొదిగిన ఎన్నో విలువైన ఆభరణాలు ఉన్నాయని అన్నారు.
మరోవైపు పూరీ జగన్నాథుడికి గల భాండాగారం ఖజానాలో వజ్రావైడూర్యాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణా భరణాలు, వెండి వంటి ఎన్నో విలువైన వస్తువులు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజుల కాలంలో కూడా ఈ భాండాగారంలో స్వామివారికోసం చేయించిన నగలను దాచి పెట్టారని అక్కడి స్జానికులు చెబుతారు. దీంతో స్వామి వారి సంపద గురించి సర్వత్రా ఆసక్తి పెరిగిపోయింది. సుమారు 46 ఏళ్ల తర్వాత నిన్న రత్న భాండాగారాన్ని తెరవడంతో. అయితే ఉదయం నుంచి అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు.భాండాగారం లోపల విష సర్పాలు ఉంటాయన్న అనుమానంతో.. స్నేక్ క్యాచర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు చేసి సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు ఈ రహస్య గదిని తెరిచారు. రత్న భాండాగారం ఉన్న మూడో గదిలోకి 11 మందితో వెళ్లిన బృందం.. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీ పెట్టెలను తీసుకెళ్లారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY