జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు జారీ

Enforcement Directorate Summons to Jharkhand CM Hemant Soren in Illicit Mining Case, Jharkhand CM Hemant Soren,Hemant Soren in Illicit Mining Case, ED Summons to Jharkhand CM, Mango News,Mango News Telugu, Directorate of Enforcement, Enforcement Directorate, Enforcement Directorate Hyd, Enforcement Directorate , Enforcement Directorate Recruitment, Token App Case Paytm, Paytm Token Case, Directorate of Enforcement,Hemant Soren,Jharkhand CM Hemant Soren Latest News And Updates

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు పంపింది. అలాగే విచారణ నిమిత్తం సీఎం హేమంత్ సోరెన్‌ ను నవంబర్ 3, గురువారం ఉదయం 11:30 గంటలకు రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో తమ దర్యాప్తు అధికారుల ఎదుట హాజరుకావాలని ఈడీ సమన్లలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి సీఎం హేమంత్ సోరెన్‌ స్టేట్మెంట్స్ ను ఈడీ రికార్డ్ చేసే అవకాశమున్నట్టు సమాచారం. మరోవైపు అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి సీఎం సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈ ఏడాది జూలైలోనే ఈడీ అరెస్టు చేసి, వారిపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి ఈడీ తమ విచారణలో భాగంగా ఇప్పటికే పలుచోట్ల సోదాలు నిర్వహించింది. సాహిబ్‌గంజ్ జిల్లా మరియు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన రాళ్లను అక్రమంగా మైనింగ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. మరోవైపు మైనింగ్ మరియు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉంటూ తన పదవిని దుర్వినియోగం చేస్తూ సీఎం హేమంత్ సోరెన్ తనకు తానే స్టోన్ మైనింగ్ లీజును కేటాయించుకున్నారని ఆరోపనలు చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై గవర్నర్ ఈసీ అభిప్రాయం కోరగా, ఎన్నికల సంఘం ఆగస్టులోనే తమ నివేదికను సీల్డ్ కవర్‌లో జార్ఖండ్ రాజ్ భవన్ కు పంపింది. ఈ క్రమంలో తాజాగా సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు పంపి, విచారణకు పిలవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =