కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ వారే..

Saints Are A Special Attraction At The Kumbh Mela, Saints Are A Special Attraction, Special Attraction At The Kumbh Mela, Special Attraction Of Saints, Mahakumbh Mela, Prayagraj, The Hustle And Bustle Of Akharas, The Kumbh Mela, Kumbh Mela, Kumbh Mela A Grand Festival, Maha Kumbh Mela Prayagraj 2025, Maha Kumbh Mela 2025,Ganga, Godavari, Kaveri, Prayagraj, Tungabhadra, Yamuna, India, National News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం.. మహా కుంభ మేళా. వచ్చే జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కాబోతోంది. మొత్తం.. 45 రోజుల పాటు కొనసాగి.. ఫిబ్రవరి 26న ముగుస్తుంది ఈ మహా కుంభమేళా జాతర. ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే.. ఆధ్యాత్మిక మహా కుంభమేళాలో పాల్గొనేందుకు, త్రివేణి సంగమ క్షేత్రంలో పుణ్య స్నానం ఆచరించేందుకు.. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు.

మహాకుంభ్ ,.. ఈ ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంలో వింతైన వేషధారణ, విశేష యోగసాధనతో కనిపించే సాధువులదే ప్రత్యేక ఆకర్షణ. కఠినమైన పద్ధతులను అనుసరిస్తూ వీరు చేసే యోగసాధన ఆద్యంతం కుంభ్ మేళా సందర్శకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహాకుంభమేళాకి అఖాడాల సందడి మొదలైంది. వీరి ప్రవేశంతో మహాకుంభమేళా వేడుకలో మరింత భక్తిపూర్వకంగా మారింది.అఖాడాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఆచార్య మహామండలేశ్వర స్వామి విశ్వాత్మానంద సరస్వతి ఆధ్వర్యంలో సాధువులు అత్యంత వైభవంగా యాత్ర ప్రారంభించారు. 20 మందికి పైగా మహా మండలేశ్వరులు, రెండు వందల మందికి పైగా నాగ సన్యాసులు యాత్రలో పాల్గొన్నారు. యాత్ర చేస్తూ మహాకుంభమేళాకి తరలివెళుతున్న అఘోరాల ఆశీర్వాదం కోసం భక్తులు పోటీ పడ్డారు. యాత్రలో పూలతో అలంకరించిన ఈటెలు ఉన్నాయి…వీటిలో సూర్య ప్రకాష్ అనే ప్రత్యేక బల్లెం ఉంటుంది..ఇది కేవలం ప్రయాగ్‌రాజ్ మహాకుంభ సమయంలో మాత్రమే అఖాడాలు ఆశ్రమం నుంచి బయటకు తీసుకొస్తారు.

ఈ నెల 13న భోగి నుంచి ఫిబ్రవరి ఆఖరివారం శివరాత్రి వరకూ ప్రయాగరాజ్ లో జరిగే మహాకుంభమేళాకి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కుంభమేళాలో సాధువులు, సన్యాసులు, అఘోరాలు, నాగ సాధువులు దర్శనమిస్తారు. వీరంతా ఆధ్యాత్మిక జీవితాన్ని సంపూర్ణం చేసుకునేందుకు భౌతిక ఆనందాలను విడిచిపెట్టి మోక్షాన్ని అన్వేషిస్తూ ఆఖరి శ్వాస వరకూ ఉండిపోతారు. మనదేశంలో ఇలాంటి వారు దాదాపు 50 లక్షల మంది వరకూ ఉన్నారని అంచనా. కుంభమేళా లాంటి అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల సమయంలో వీరు ఎక్కువగా కనిపిస్తారు.

కుంభమేళాలో నాగ సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరి జీవన శైలి మిగిలిన ప్రజల కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది. సనాతన ధర్మాన్ని రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. దుస్తులు, బంధాలను త్యజించి మనసుతో శరీరాన్ని శాసిస్తారు. నిరంతరం ధ్యానంలో ఉంటారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. జనావాసాలకు దూరంగా ఉంటారు. అందుకే కుంభమేళా లాంటి ప్రత్యేక సమాయాల్లో గుంపులుగా తరలివచ్చే వీరిని చూసేందుకు భక్తులు పోటీపడతారు. నాగసాధువులు తమ ప్రతిజ్ఞలో భాగంగా కనీసం 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాలను సందర్శించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో సూర్యోదయానికి ముందే నదిలో స్నానమాచరిస్తారు.

ఇక కుంభమేళా లాంటి ఆధ్యాత్మిక ఉత్సవాల్లో సాధువులు భారీగా పాల్గొనేలా చేయడంలో అఖాడాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. సాధు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, సనాతన జీవన విధానాన్ని రక్షించేందుకు ఆదిశంకరాచార్యులు ఎనిమిదో శతాబ్ధంలో అఖాడాలను స్థాపించారు. ఇప్పుడు కుంభమేళాలో ఎక్కువమంది సాధువులు పాల్గొనేలా చేయడంలోనూ అఖాడాలదే కీలకపాత్ర. గతంలో అఖాడాలు, నాగ సాధువుల ఆధ్వర్యంలోనే మహా కుంభమేళా జరిగేది..కానీ తర్వాత ప్రభుత్వాల ఆధ్వర్యంలో మహాకుంభమేళా లాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు జరుగుతున్నాయి.