ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌పై ఢిల్లీ సమావేశానికి ఆహ్వానం

West Bengal Chief Minister Mamata Banerjee Writes Letter To CM KCR For The Meeting To Discuss on President Elections, Chief Minister Mamata Banerjee Writes Letter To CM KCR For The Meeting To Discuss on President Elections, West Bengal Chief Minister Writes Letter To CM KCR For The Meeting To Discuss on President Elections, Meeting To Discuss on President Elections, President Elections Meeting, President Elections, West Bengal Chief Minister Mamata Banerjee, Chief Minister Mamata Banerjee, West Bengal Chief Minister, Mamata Banerjee, West Bengal CM Banerjee, Telangana Chief Minister KCR, Telangana CM KCR, President Elections Meeting News, President Elections Meeting Latest News, President Elections Meeting Latest Updates, President Elections Meeting Live Updates, Mango News, Mango News Telugu,

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేయడానికి జూన్ 15 న న్యూఢిల్లీలో తాను ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని లేఖలో సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్న తరుణంలో మమతా 8 రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స‌హా మొత్తం 22 మంది జాతీయ స్థాయి నేత‌ల‌కు లేఖ రాశారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీకి ధీటుగా ఒక బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని బ‌రిలో నిలిపేందుకు మ‌మ‌త ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇలా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేకులనందరినీ కూడగట్టేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో మ‌మ‌తా బెన‌ర్జీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా 22 మంది ప్రతిపక్ష నేతలకు లేఖ రాశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ‘జూన్ 15, 2022 మధ్యాహ్నం 3 గంటలకు న్యూ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని, అన్ని ప్రగతిశీల ప్రతిపక్ష శక్తులకు మా గౌరవనీయ ఛైర్‌పర్సన్ మమతా పిలుపునిస్తున్నారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here