అందం, శరీరం అశాశ్వతం అని..అందుకే అందాన్ని, శరీరాన్ని చూసుకుని మురిసిపోవద్దని, గర్వాన్ని ప్రదర్శించొద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. వయసు పెరిగిన కొద్దీ శరీరం ముడతలు పడి, అందం తగ్గడం అనేది ప్రతీ ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అంటారు. కానీ గ్లామర్ ప్రపంచంలో ఉండేవాళ్లు మాత్రం తరిగే అందాన్ని చూసి భయపడుతూ ఉంటారు. దీనికోసం పార్లర్లు, హాస్పిటల్స్ చుట్టూ అందానికి మెరుగులు దిద్దుతూ, బొటాక్స్ వంటి పద్దతుల ద్వారా ముడతలను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
పెరుగుతున్న డిమాండ్‌తో వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో వచ్చే శారీరక మార్పులను అడ్డుకోవడానికి.. ఎప్పటినుంచో యాంటీ ఏజింగ్ పరిశోధనలు కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి. అలా వయసు పెరగకూడదు, అందం తరిగిపోకూడదు అనుకునే వాళ్లకు ఓ గుడ్ న్యూస్ వినిపించారు సింగపూర్ శాస్త్రవేత్తలు. వయసు పెరుగుదలకు కారణం అవుతున్న ఓ ప్రోటీన్‌ను సింగపూర్ శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించడంతో చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శరీరంలో ఉండే ఓ ప్రోటీన్ ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా .. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే శారీరక క్షీణత ప్రక్రియ వేగాన్ని చాలావరకూ తగ్గించవచ్చని సైంటిస్టులు వెల్లడించారు. సింగపూర్‌కు చెందిన డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు. దీంతో ఇప్పటికే కోట్లు, లక్షలు ఖర్చుపెడుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నవారంతా ఇప్పుడు సింగపూర్ శాస్త్రవేత్తలు చెప్పిన గుడ్ న్యూస్ తో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE