ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన రోజున.. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారంటూ కొద్దిరోజులుగా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రమాణస్వీకారానికి అతిథిగా హాజరయిన అమిత్ షా వేదికపై ఆశీనులయ్యారు. ఆయన పక్కన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత తమిళిసై కూడా వేదికపైకి వెళ్తూ.. అక్కడున్న పెద్దలకు అభివాదం చేశారు. ఈక్రమంలో అమిత్ షా.. తమిళిసైని పిలిచి వేలు చూపిస్తూ మాట్లాడారు. తమిళిసైకి.. అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్లు ఆ వీడియోలో కనిపించడంతో.. అందరూ అదే నమ్ముతున్నారు.
ఈక్రమంలో అసలు ఆరోజు ఏం జరిగిందో తమిళిసై వివరించారు. అసలు అమిత్ షా తనతో ఏం మాట్లాడారు?.. తాను ఏం మాట్లాడారు?.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఉంది అనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని తమిళిసై కొట్టిపారేశారు. అమిత్ షా తనకు ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదని.. పలు సూచనలు, సలహాలు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికలు ముగిశాక మొదటిసారి చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశానని తమిళిసై అన్నారు. పోలింగ్ తర్వాత తమిళనాడులో పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు, ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు తనను పిలిచారని స్పష్టం చేశారు. తాను మాట్లాడుతున్నప్పుడు అమిత్ షా సమయాభావాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడారని.. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాల్ని ముమ్మరంగా చేపట్టాలని సూచించారన్నారు. ఆయన మాటలు తనకెంతో భరోసా కల్పించామయని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా వాస్తవం కాదని తమిసై సౌందర రాజన్ క్లారిటీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE