కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఎన్‌డిఎ ప్రభుత్వ మూడవ దఫా మొదటి బడ్జెట్‌ను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. నిర్మలా సీతారామన్ సమర్పించినది కేంద్ర బడ్జెట్ కాదు… లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచురించిన ఎన్నికల మేనిఫెస్టో అంటూ వంగ్యాస్రాలు సంధించారు. “ఎన్నికల ఫలితాల తర్వాత, గౌరవనీయులైన ఆర్థిక మంత్రి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినందుకు నేను సంతోషిస్తున్నాను” అని చిదంబరం చమత్కరించారు. “కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 30వ పేజీలో ప్రతిపాదించిన ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ అలవెన్స్ (ఈఎల్‌ఐ)ని నిర్మల ఆమోదించినందుకు నేను సంతోషిస్తున్నాను” అని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన చిదంబరం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 11వ పేజీలో పేర్కొన్న ప్రతి అప్రెంటిస్‌కు భత్యం ఇవ్వడంతోపాటు అప్రెంటీస్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నేను సంతోషిస్తున్నాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మరికొన్ని ప్రాజెక్టులను ఆర్థిక మంత్రి కాపీ కొట్టి ఉంటే బాగుండేదని, తప్పిపోయిన కొన్ని అవకాశాల జాబితాను ఇస్తానని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో లోని 31 వ పేజీలో ప్రతిపాదించిన, ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న ఏంజెల్ ట్యాక్స్ రద్దును ఆర్థిక మంత్రి నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగమేనని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ఇక బడ్జెట్ పై తెలంగాణలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసాడని సీఎం రేవంత్ తో సహ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి బడ్జెట్ లో తెలంగాణ ప్రజల కోరికలు తీరుస్తాడని ఏకంగా 8 మంది ఎంపీలను ఇస్తే..మాకు మాత్రం ‘0’ బడ్జెట్ ఇచ్చారని మండిపడుతున్నారు. ఈ బడ్జెట్ కేవలం చంద్రబాబు, నితీష్ కుమార్‌కు మేలు జరిగేలా ఉంది తప్ప తెలంగాణ ప్రజలకు ఏమాత్రం మేలు జరగలేదని వాపోతున్నారు.
ఇక ఏపీకి బడ్జెట్ లో కేటాయింపులు పై రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుండగా… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాత్రం విమర్శలు గుప్పించారు. ఇది బడ్జెట్ కాదు. ఎన్నికల మ్యానిఫెస్టో. ఏది పడితే అది చెప్పొచ్చు. ఏదైనా హామీ ఇవ్వొచ్చు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి. కాలపరిమితి ఉండాలి. ఇది పూర్తిగా మ్యనిఫెస్టో. సీఎం చంద్రబాబు లక్ష కోట్లు కావాలని అడిగారు. ఏపీకి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉంది. కానీ బాబు అడిగింది కేవలం 1 లక్ష కోట్లు మాత్రమే. 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలియదు. బడ్జెట్‌లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు.. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారని విమర్శించారు. పోలవరంకి ఎన్ని నిధులు ఇచ్చారు? పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎంతో తెలియదు. 12 వేల కోట్లు రీహాబిలిటేషన్ (పునరావాసం)కి కావాలి. ముఖ్యమైన ప్రాజెక్టుకి నిధులు ఎంత ఇస్తారో ఎందుకు చెప్పలేదు ? ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌కి ఎంత నిధులు ఇస్తారు? హామీలు ఇస్తే సరిపోతుందా? 500 కోట్లు ఇస్తారా? 5 వేల కోట్లు ఇస్తారా?” అని షర్మిల ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE