గడువు సమీపిస్తోన్న కొద్దీ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ ఏడాది నవంబర్‌లో పోలింగ్ జరుగనుండటంతో ప్రచార తీవ్రత రోజురోజుకూ హీటెక్కిపోతుంది. అభ్యర్థుల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొని..తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న జో బైడెన్..తన స్థానంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పేరు ఖరారు చేశారు. అటు కమలా హ్యారిస్‌ను తమ అభ్యర్థిగా అధికారికంగా కూడా డెమొక్రటిక్ పార్టీ ప్రకటించింది.
ఇక ఇటు రిపబ్లికన్ల తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడోసారి కూడా రేసులో నిలబడ్డారు. ఇప్పడు వీరిద్దరి మధ్ విమర్శలు-ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి. అలా తాజాగా కమల హ్యారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమౌతోన్నాయి. చికాగోలో నేషనల్ అసోయేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్ ఏర్పాటు చేసిన ఓ కన్వెన్షన్‌లో ట్రంప్ జర్నలిస్టులతో ముఖాముఖి మాట్లాడారు. సుమారు వెయ్యిమందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలను ఇచ్చారు. ఈ క్రమంలోనే కమలా హ్యారిస్‌పై ఆయన జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే విమర్శలు తలెత్తుతున్నాయి.
కమలా హ్యారిస్ భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా? అన్నది తనకు అర్థం కావట్లేదని డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలం వరకు కమలా హ్యారిస్ స్వదేశంలో భారతీయతను ప్రోత్సహించేలా వ్యవహరించారని, ఇప్పుడు నల్ల జాతీయురాలిగా గుర్తింపు పొందడానికి ఆమె ప్రయత్నిస్తోన్నారని ట్రంప్ అక్కడ చెప్పారు. కాకపోతే భారతీయులన్నా, నల్ల జాతీయులన్నా తనకు ఎంతో గౌరవం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. కమలా హ్యారిస్ జన్మతహా భారతీయురాలే అయినా కూడా.. దేశంలో ఉన్న పరిస్థితులను సొమ్ము చేసుకునేలా ఇప్పటికిప్పుడు నల్ల జాతీయురాలిలాగా వ్యవహరించడం మొదలు పెట్టారని ట్రంప్ కామెంట్లు చేశారు. నల్లజాతీయుల ఓట్లను ఆకర్షించడానికే కమలా హ్యారిస్ ఆ ముద్రను పొందే ప్రయత్నం చేస్తోన్నారంటూ పరోక్షంగా ఆరోపించారు.
మరోవైపు దీనిపై కమలా హారిస్ కూడా స్పందించారు. ట్రంప్ మళ్లీ తన పాత విధానాలైన విభజన సిద్ధాంతం, అగౌరవపర్చే ధోరణినే ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఇలాంటివారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమమైన నాయకులు రావాలని ఆమె కోరారు. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదని ఐకమత్యంగా ఉంచాలన్నారు. అదే మన బలం అని చెప్పిన ఆమె.. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దని బలంగా చెప్పారు. వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
కమలా హ్యారిస్ తల్లి పేరు శ్యామల గోపాలన్ కాగా.. ఆమె స్వస్థలం తమిళనాడులోని తులసేంద్రపురం. తండ్రి డొనాల్డ్ జే హ్యారిస్‌ది జమైకా. శ్యామలా గోపాలన్ 65ఏళ్ల కిందటే ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికాకు తరలి వెళ్లి.. ఓక్లాండోలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలో చదువుకుని.. డాక్టరేట్ పొందిన ఆయన జమైకాకు చెందిన ఎకనమిస్ట్ డొనాల్డ్ హ్యారిస్‌ను పెళ్లాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ