నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న జనసేనాని పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Likely To Meet Union Home Minister Amit Shah and BJP President JP Nadda Today in Delhi,Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan Likely To Meet Union Home Minister,Pawan Kalyan Likely To Meet Amit Shah,Pawan Kalyan Likely To Meet BJP President JP Nadda,Janasena Chief To Meet JP Nadda Today in Delhi,Mango News,Mango News Telugu,Pawan Kalyan Meets BJP in-Charge,Pawan Kalyan Calls on BJP State in-Charge,Pawan to Meet BJP Top Brass,Jana Sena leader Pawan Kalyan reaches Delhi

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ సత్వరమే పూర్తికి కేంద్రమే చొరవ తీసుకోవాలని కోరిన జనసేనాని.. పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇప్పటివరకు నిర్వాసితులకు పునరావాసం అమలు పైనా దృష్టి పెట్ట లేదని తెలిపారు. ఇక అంతకుముందు జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మురళీధరన్‌తో సమావేశమయ్యారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై పెరుగుతున్న దాడులపై చర్చించడంతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.

ఇక పవన్ ఈరోజు కూడా మరోసారి మురళీధరన్‌తో సమావేశమవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా రాష్ట్రంలో పొత్తుకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌పై కూడా పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు నేతలను కలవాల్సి ఉన్నందున తర్వాత మీడియాతో మాట్లాడతానని సమావేశం నుంచి బయటకు వచ్చిన అనంతరం పవన్ చెప్పారు. బీజేపీ ముఖ్య నేతలందరినీ కలిశాక పర్యటన పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలియజేశారు. కాగా ఈ క్రమంలో నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కాగా గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మచిలీపట్నంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. బీజేపీ కేంద్ర నాయకత్వంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే ప్రజా సమస్యలపై జనసేనతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర నాయకత్వం విముఖంగా ఉందని పవన్ చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − three =