ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించిన ఐదవ షూటర్‌గా, మొదటి మహిళా నిలిచిన మను భాకర్, 2024 ఒలింపిక్స్‌లో భారతదేశానికి తొలి పతకాన్ని సాధించిపెట్టింది. ఫైనల్స్‌లో కొరియా షూటర్లు కొత్త ఒలింపిక్ రికార్డులతో స్వర్ణం, రజతం సాధించగా, వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్ పతకం గెలవడం అనేది ఒక కల… ఇది నాకే కాదు, ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కల నిజమైంది. NRAI మరియు SAIకి ధన్యవాదాలు తెలిపారు. క్రీడా మంత్రిత్వ శాఖ, కోచ్ జస్పాల్ రాణా, హర్యానా సర్కార్ మరియు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్‌లకు ధన్యవాదాలు తెలిపారు. వారి మద్దతు వల్లే ఈ పతకాన్ని సాధించానని తెలిపారు. ప్రతి భారతీయుడికి ఈ పతకాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు మను భాకర్.
ఈ పథకం సాధించి షూటింగ్ సర్కిల్‌లో మను భాకర్ సంచలనంగా మారింది. చిన్న వయసులోనే మార్క్స్‌మెన్‌షిప్‌పై పట్టు సాధించిన మను హర్యానాకు చెందిన అమ్మాయి. యుక్తవయసులోనే అంతర్జాతీయ షూటింగ్‌లో సంచలనం సృష్టించింది. షూటింగ్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ పతకాన్ని సాధించినప్పుడు మను భాకర్ వయసు కొన్ని నెలలే. ఇప్పుడు భారత్ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించింది. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి తొలిసారి భారీ సందడి చేసిన మను భాకర్.. ఆ తర్వాత ఇంటర్నేషనల్ షూటింగ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది.
14 ఏళ్ల వయసులో షూటింగ్ ప్రారంభించిన మను భాకర్.. తక్కువ సమయంలోనే జాతీయ షూటింగ్ టీమ్‌లో అత్యుత్తమ షూటర్‌గా నిలిచింది. తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడంతో కొంతకాలం షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. తన కోచ్ జస్పాల్ రానా అభ్యర్థన మేరకు షూటింగ్ అరేనాకు తిరిగి వచ్చిన మను భాకర్ 2018 కామన్వెల్త్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం వేటలో విఫలమయినప్పుడు షూటింగ్ నుంచే నిష్క్రమించాలనుకుంది. కానీ పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్దమయి తను కన్న కలలు సాధించుకుంది.
ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధించిన షూటర్లు
- రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (పురుషుల డబుల్ ట్రాప్) – 2002 ఏథెన్స్ ఒలింపిక్స్, రజత పతకం
- అభినవ్ బింద్రా (పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్) – 2008 బీజింగ్ ఒలింపిక్స్, స్వర్ణ పతకం
- గగన్ నారంగ్ (పురుషుల డబుల్ ట్రాప్, లండన్ 10 మి. R02) పతకం
- విజయ్ కుమార్ (పిస్టల్ ర్యాపిడ్ ఫైర్) – 2012 లండన్ ఒలింపిక్స్, రజత పతకం
- మను భాకర్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్) – 2024 పారిస్ ఒలింపిక్స్, కాంస్య పతకం
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE