ట్రంప్ గోల్డ్ కార్డు ప్రకటన చేయగానే..ప్రపంచవ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తోంది. అసలు ఈ కార్డుతో ఉపయోగాలున్నాయా.ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగం ఎంత అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తెరపైకి గోల్డ్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చి.. అమెరికాలో పౌరసత్వం కావాలంటే 5 మిలియన్ డాలర్లు ఉంటే చాలని అన్నారు.
నిజానికి అమెరికాకు వెళ్లాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అక్కడ చదువుకోవాలని వీలయితే అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండాలని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. అయితే వీసాతో అమెరికాలో కొన్నాళ్లు ఉండొచ్చు కానీ.. శాశ్వతంగా నివాసం పొందాలంటే మాత్రం గ్రీన్ కార్డు ఉండాలి. అందుకే ఈ కార్డు కోసం అక్కడి వారు ఎదురుచూస్తూ ఉంటారు.
మరికొంతమంది అక్రమంగా అమెరికాలో నివాసం ఉండిపోవడంతో..ట్రంప్ అధికారంలోకి రాగానే అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని కొందరని తిరిగి వారివారి దేశాలకు పంపేశారు. వీరిలో భారత్ కు చెందిన చాలా మంది కూడా తిరుగుపయనమయ్యారు. దీంతో కొందరు వ్యాపారులు కూడా అమెరాకాకు బదులు ప్రత్యామ్నాయ దేశాన్ని ఎంచుకుంటున్నారు. ఇది గమనించిన డొనాల్డ్ ట్రంప్ తెరపైకి గోల్డ్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చి.. అమెరికాలో పౌరసత్వం కావాలంటే 5 మిలియన్ డాలర్లు ఉంటే చాలని చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. ఓ వైపు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని పంపేస్తూనే మరో వైపు తమ దేశానికి గోల్డ్ కార్డ్ కొనుక్కుని రావాలంటూ ఆహ్వానించారు. గోల్డ్ కార్డు ఉన్న వారు అమెరికాలో హాయిగా వ్యాపారం చేసుకోవచ్చని అన్నారు. దీంతో..ఈ గోల్డ్ కార్డు కేవలం వ్యాపారులకేనా? ఇక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు వర్తించదా? అన్న చర్చ ప్రారంభమైంది.
దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చిన ట్రంప్.. గోల్డ్ కార్డు అనేది కేవలం సంపన్నులకు మాత్రమే కాదని, స్టూడెంట్స్ కు కూడా వర్తిస్తుందని తెలిపారు. అయితే కొన్ని కంపెనీలు గోల్డ్ కార్డును కొనుగోలు చేసి వాటి ద్వారా స్కిల్ కలిగిన వారిని తీసుకుంటారని క్లారిటీ ఇచ్చారు. అమెరికాకు చెందిన కొన్ని బడా కంపెనీలు కూడా నాణ్యమైన మానవ వనరుల కోసం చూస్తున్నాయని తెలిపారు. దీని కోసం భారత్ , చైనా, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చిన విద్యార్ధులు హార్వర్డ్ వంటి సంస్థల్లో చేరతారని.. ఇలాంటి వారి కోసం కంపెనీలే గోల్డ్ కార్డులను కొనుగోలు చేస్తాయని తెలిపారు.
అలాగే గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు వచ్చిన వారు గ్యారంటీగా పెద్ద ధనవంతులు అవుతారంటూ ట్రంప్ తన మాటల గారడీకి పదును పెట్టారు. అంతేకాదు వీళ్లే ఎక్కువగా తమ దేశానికి ట్యాక్సులు కడతారని.. దీంతో ఇద్దరికీ ఉపయోగంగా ఉంటుందని ట్రంప్ కొత్త లాజిక్ తెరమీదకు తీసుకువచ్చారు. మరోవైపు ఈ గోల్డ్ కార్డు ఈబీ-5 వీసాలను భర్తి చేస్తుందని ఇప్పటికే అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ అన్నారు. ఈ గోల్డ్ కార్డు విధానం ద్వారా మోసాలు, అక్రమాలు అరికట్టగలుగుతామని చెప్పారు.
అయితే ఈ విధానం కొందరికి బాగున్నా..చదువుకోవడానికి వెళ్లే మిడిల్ క్లాస్, ఎబౌ మిడిల్ క్లాస్ విద్యార్థులకు మాత్రం ఇది కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈ గోల్డ్ కార్డు కేవలం హార్వర్డ్ లాంటి పెద్ద ఇనిస్ట్యూట్ ల్లో అవకాశం లభించిన విద్యార్థులకు మాత్రమే వర్తించేలా ఉందని ..దీని వల్ల మిడిల్ క్లాస్ యువత డాలర్ డ్రీమ్స్ కల కలగానే మిగిలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.