అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వలసదారులను వారి దేశాలకు పంపడం, విదేశీ దిగుమతులపై అధిక సుంకాలు విధించడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై శాంతి చర్చలు జరపడం వంటి వివాదాస్పద నిర్ణయాలతో పాటు, తాజాగా ఆయన తీసుకున్న ఒక ప్రత్యేకమైన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రంప్ తన తొలి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూనే 13 ఏళ్ల బాలుడు డీజే డేనియల్‌ను యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ అనూహ్య నిర్ణయంతో సభలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, దీని వెనుక ఉన్న కారణం ఎంతో హృదయవిదారకమైనది.
డీజే డేనియల్ చిన్న వయస్సులోనే అరుదైన క్యాన్సర్‌తో పోరాడాడు. వైద్యులు అతడు ఎక్కువకాలం బతకడని చెప్పినా, తన దృఢ సంకల్పంతో వ్యాధిని జయించాడు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కలతో బతికిన డేనియల్, అవరోధాలను ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు సాగించాడు. ఈ బాలుడి గురించి తెలియడంతో ట్రంప్ ఆయనకు గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. “డేనియల్ ధైర్యం, సంకల్పం అసాధారణమైనవి. అతడు నిస్సహాయంగా ఉండకుండా పోరాడాడు. అతని కలను గౌరవించేందుకు మేము అతన్ని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమిస్తున్నాం” అని ట్రంప్ ప్రకటించారు.
ఈ ప్రకటనతో సభలో ఉన్న రిపబ్లికన్ సభ్యులంతా హర్షధ్వానాలు చేశారు. డేనియల్ తండ్రి తన కుమారుడిని గర్వంగా ఎత్తుకొని చూపించగా, సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కరన్ అధికారిక ఐడీ కార్డు అందజేశారు. బాలుడు ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న ఆనందంతో ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
D.J. Daniel joined President Trump at the Joint Session—a 13-year-old battling cancer who has been sworn in as an honorary officer over 900 times.
President Trump made his dream come true, swearing him in as a Secret Service agent. pic.twitter.com/HkVf8LlPTD
— The White House (@WhiteHouse) March 5, 2025