కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌కు ఉత్తరాన రిక్టర్‌స్కేల్‌పై 7.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప ప్రభావం కొలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై పడింది. అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ (USGS) ఈ ప్రకంపనల అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
ఫిబ్రవరి 9న, కేమన్ దీవులకు నైరుతి దిశగా కరేబియన్ సముద్రంలో రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో, కేమన్ దీవుల్లోని జార్జ్ టౌన్‌కు నైరుతి దిశగా 209 కిలోమీటర్ల దూరంలో ఉందని USGS పేర్కొంది. భారీ ప్రకంపనలతో సముద్రంలో పెద్దఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ప్రకటించింది.
సునామీ హెచ్చరికలు: పశ్చిమ కరీబియన్ దేశాలు అప్రమత్తం
సునామీ ముప్పు కారణంగా ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ దీవులు, కేమన్ దీవులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అమెరికా భూభాగానికి ప్రమాదం లేదని స్పష్టత ఇచ్చినప్పటికీ, హోండురస్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, మెక్సికో, బహామాస్, హైతీ, టర్క్స్ అండ్ కైకోస్, బెలిజ్, కొలంబియా, పనామా తదితర దేశాల్లోని తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలకు జారీ చేసిన సూచనలు
తీర ప్రాంతాలు, బీచ్‌లను వెంటనే ఖాళీ చేయాలి.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలి.
1-3 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది.
బోట్లు, ఓడలు సముద్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
అధికారులకు సహకరించి, అత్యవసర సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భూకంప ప్రభావం & గత రికార్డులు
2021లో హైతీలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత, ఇదే ప్రాంతంలో ఇదే భారీ భూకంపం సంభవించడం ఇదే మొదటిసారి. స్థానిక ప్రభుత్వాలు హైఅలర్ట్ ప్రకటించాయి. ప్యూర్టో రికో గవర్నర్ జెన్నిఫర్ గొంజాలెజ్ కోలన్ కూడా ప్రజలను అప్రమత్తం చేశారు.
క్యూబా, డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వాలు తీర ప్రాంత నివాసితులను సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. కేమన్ దీవుల విపత్తు నిర్వహణ సంస్థ తీర ప్రాంత ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అధికారులకు ప్రజలు సహకరించాలని, అత్యవసర చర్యల కోసం సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. ఈ భూకంపం తర్వాత రాబోయే కొన్ని గంటల్లో సముద్రతీర ప్రాంతాల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం.
A powerful 8.0 magnitude earthquake has struck by Cayman Islands. It was an under water earthquake which results in Tsunami threats 😳 pic.twitter.com/vgaG8xK5IQ
— Adjusted55 (@BillPrinter00) February 9, 2025