కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన మోడీ సర్కార్ భారీ అంచనాల మధ్య పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉదయం 11.04 గంటలకు 202-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్.. తాజా బడ్జెట్‌తో కలిపి ఏడో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా.. ప్రజల మద్ధతుతో మూడోసారి అధికారంలోకి వచ్చామని సీతారామన్ వెల్లడించారు. దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉందని వెల్లడించారు. అన్నదాతల కోసం ఇటీవల పంట కనీస మద్ధతును పెంచినట్లు తెలిపారు. అలాగే మరో అయిదేళల పాటు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
నిరుద్యోగుల కోసం మూడు పథకాలు తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా వాటిని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంఘటిత రంగంలోకి ప్రవేశించిని తొలిసారి ఉద్యోగులకు ఒక నెత వేతనం మూడు వాయిదాల్లో చెల్లించనున్నట్లు తెలిపారు. గరిష్టంగా రూ. 15 వేలు చెల్లిస్తామని.. నెలకు గరిష్టంగా రూ. 1 లక్ష లోపు వేతనం ఉన్న వారు అర్హులని స్పష్టం చేశారు. అలాగే దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌కు నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకర చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్ల సాయం చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తుల్లో అవసరమయితే మరిన్ని నిధులను కేటాయిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు పెద్ద పీఠ వేస్తామని.. త్వరితగతిన ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అలాగే రాయలసీమ, ప్రకాశ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.
బీహార్‌కు కూడా ఆర్థిక సాయం ప్రకటించారు. బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే బీహార్‌లో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బీహార్‌లో వరదల నివారణకు.. సాగు కార్యక్రమాలకు రూ. 11 వేల కోట్లు కేటాయించారు. బీహర్‌తో పాటు అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌లకు కూడా వరద నివారణకు ప్రత్యేక నిధులను కేటాయించారు.
అలాగే గ్రామీణ అభివృద్ధికి రూ. 2.66 లక్షల కోట్లు.. ముద్ర రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణంపై నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటన చేశారు. అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు మరోసారి బడ్జెట్‌లో పెద్ద పీఠ వేశారు. ఇందుకోసం రూ. 11.11 కోట్లను కేటాయించారు. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బంగారం, వెండిపై 6 శాతం సుంకం.. ప్లాటినమ్‌పై 6.4 శాతం సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF