భారత దేశంలో పుట్టిన యోగాలో మెడిటేషన్ ఒక భాగం. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి దూరమవుతూ ఉండటం వల్ల అనేక రుగ్మతలు నయమవుతాయి. ధ్యానం వల్ల అనేక వ్యాధులను నయం అవుతాయి. భారతీయ యోగాలో ధ్యానం కూడా ఒక భాగం. ప్రతీ ఒక్కరిలో జ్ఞాపక శక్తిని పెంచడానికి ధ్యానం దోహదపడుతుంది.
అందుకే ఎన్నో ప్రాముఖ్యతలున్న ధ్యానానికి ఒక రోజు ఉండాలంటూ ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఇక నుంచి ప్రతీ ఏటా డిసెంబర్ 21 వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలంటూ భారత్ తీసుకువచ్చిన ప్రతిపాదనకు ఐరాస ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపింది. ఇండియా, లీచెన్టయిన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రాలతో కూడిన దేశాల బృందం 193 సభ్యదేశాలతో కూడిన జనరల్ అసెంబ్లీలో.. తాజాగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
ధ్యాన దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే.. ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచి ఆంతరంగిక శాంతిని అందిస్తుంది. దీనివల్ల జీవితంలో ఒత్తిళ్లను తగ్గించి, శరీర, మనస్సు, ఆత్మలో సమతుల్యతను నెలకొల్పుతుంది. అలాగే నిరంతర ధ్యానం అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది దీని ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు ధ్యానం వల్ల హదయ సంబంధిత రుగ్మతలు తగ్గుతాయి.
ధ్యానం వల్ల సామాజిక ఏకత సాద్యమవుతుంది. ఎలా అంటే ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తులు ధ్యానంలో తాము అనుభవిస్తున్న ప్రయోజనాలను ఒకరితో ఒకరు
పంచుకుంటూ ఒక సమాజాన్ని, ప్రపంచాన్ని శాంతియుతంగా మారుస్తున్నారు. అందుకే డిసెంబర్ 21వ తేదీన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ప్రతి ఒక్కరూ కొంచెం సమయం కేటాయించి ధ్యానం చేయాలని ఐరాస ఆకాంక్షిస్తోంది.