కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. కొత్త కొత్త మార్గాల్లో వాటిని నడిపిస్తోంది. తాజాగా వందేభారత్ మెట్రో సర్వీస్ పేరును మార్చింది రైల్వే శాఖ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. వందేభారత్ పేరును “నమో భారత్ ర్యాపిడ్ రైల్”గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందే పేరు మార్పు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో సాయంత్రం 4.15 గంటలకు భుజ్ రైల్వే స్టేషన్ నుంచి వందేభారత్ మెట్రో సేవలను ప్రారంభిస్తారని అధికారులు చెప్పారు.
అదే సమయంలో వందే మెట్రో రైళ్లను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌లోని భుజ్- అహ్మదాబాద్ మధ్య తొలి వందే మెట్రో ఎక్స్‌ప్రెస్ పరుగులు పట్టాలెక్కబోతోంది. ప్రధాని మోదీ ఈ రైలును సోమవారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. మరి కొన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపారు. భుజ్- అహ్మదాబాద్ మధ్య దూరం 359 కిలోమీటర్లు. ఈ దూరాన్ని అధిగమించడానికి వందే మెట్రోలో పట్టే సమయం 5:45 నిమిషాలు. టికెట్ ఖరీదు 455 రూపాయలుగా నిర్ధారించారు. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో వందే మెట్రో పరుగులు తీయగలదు. ముంబై సబర్బన్ స్థానంలో.. క్రమంగా ముంబైలో ఈ వందే మెట్రో రైలు సర్వీసులు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. లక్షలాదిమంది ముంబైకర్లు రోజూ రాకపోకలు సాగించే లోకల్/సబర్బన్ రైళ్ల స్థానంలో వందే మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావొచ్చు. దీనికోసం 238 సర్వీసులకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 60కి పైగా రైళ్లు పట్టాలెక్కాయి. ఆదివారం నాడే ప్రధాని మోదీ ఆరు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. సాధారణ మెట్రో రైలుతో పోల్చుకుంటే ఎంతో భిన్నంగా దీన్ని రూపొందించారు. ఒకేసారి 1,150 మంది ప్రయాణించగలిగేలా మొత్తం 12 కోచ్‌లు ఈ ఎక్స్‌ప్రెస్‌ను తీర్చిదిద్దారు. డబుల్ లీఫ్ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్‌ను కలిగివుండటం దీని ప్రత్యేకత. సాధారణంగా మెట్రో రైలు స్టేషన్‌లల్లో ఇలాంటి డోర్స్ కనిపిస్తుంటాయి. భోజన సదుపాయం.. ఎకో ఫ్రెండ్లీ టాయ్‌లెట్స్, సీల్డ్ ఫ్లెక్సిబుల్ గ్యాంగ్‌వే, రెయిన్ ప్రూఫ్ ఇంటీరియర్‌తో అత్యాధునికంగా నిర్మించారు. భోజన సదుపాయం సైతం అందుబాటులో ఉంటుంది ఇందులో. వచ్చే 35 సంవత్సరాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వందే మెట్రో సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రానుంది కేంద్రం.