అక్టోబర్ 22న రోజ్‌గార్ మేళా ప్రారంభించనున్న ప్రధాని మోదీ, 75 వేల మందికి నియామక పత్రాలు కూడా అందజేత

PM Modi will Launch Rozgar Mela on OCT 22 Will handed Over Appointment Letters to 75000 Newly Inducted Appointees, PM Narendra Modi, PM Modi will Launch Rozgar Mela, Rozgar Mela on OCT 22, Appointment Letters to 75000 Appointees, Mango News, Mango News Telugu, Rozgar Mela, Diwali Gift From Pm Modi, Govt To Launch Recruitment Drive, Recruitment Drive For 10 Lakh Personnel, Modi Handed 75000 Appointment Letters, Rozgar Mela Latest News And Updates, Diwali Celebrations

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అక్టోబ‌ర్ 22, శనివారం ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళాను (10 ల‌క్ష‌ల మంది సిబ్బంది రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌) ప్రారంభించనున్నారు. అలాగే ఈ వేడుకలో కొత్తగా నియమితులైన 75,000 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మరియు పౌరుల సంక్షేమానికి భరోసా ఇవ్వడానికి ప్రధాని మోదీ యొక్క నిరంతర నిబద్ధతను నెరవేర్చడానికి రోజ్‌గార్ మేళా ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని చెప్పారు. ప్రధాని ఆదేశాల మేరకు, అన్ని మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు మిషన్ మోడ్‌లో మంజూరు చేయబడిన పోస్టులను భర్తీ చేయడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్త రిక్రూట్‌లు కేంద్ర ప్రభుత్వం యొక్క 38 మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో చేరతారని తెలిపారు. గ్రూప్-ఎ, గ్రూప్-బి (గెజిటెడ్), గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) మరియు గ్రూప్-సి కింద నియమితులైనవారు వివిధ స్థాయిలలో ప్రభుత్వంలో చేరతారని చెప్పారు.

అలాగే నియామకాలు జరుగుతున్న పోస్టులలో సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ పర్సనల్, సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్‌డిసి, స్టెనో, పిఎ, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, ఎంటిఎస్, తదితర పోస్టులు ఉన్నాయన్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లు మంత్రిత్వ శాఖలు మరియు డిపార్ట్‌మెంట్‌లు స్వయంగా లేదా యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వంటి రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా మిషన్ మోడ్‌లో జరుగుతాయని చెప్పారు. వేగవంతమైన రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక ప్రక్రియలు సరళీకృతం చేయబడడంతో పాటుగా సాంకేతికతతో అనుసంధానించబడ్డాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =