ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఎన్నికల గురించే టాపిక్ నడుస్తోంది. జూన్ 4వ తేదీన విడుదలయ్యే ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాబోతున్నాయి? ఏ పార్టీకి ఏ నియోజకవర్గం పట్టం కట్టింది? ఏ నేతను ప్రజలు కోరుకుంటున్నారు అన్న చర్చలే సాగుతున్నాయి.
తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారన్న చర్చలతో పాటు..ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో గెలుపు ఎవరిని వరిస్తుందన్న చర్చ హాటుహాటుగా సాగుతున్నాయి. అయితే ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న ప్రతీసారి కూడా మొదటి రౌండ్ పూర్తయ్యాక ఆ పార్టీ ఆధిక్యం.. రెండో రౌండ్ పూర్తయ్యాక ఇన్ని ఓట్లు అంటూ ఫలితాలను విడుదల చేయడం మనం చూస్తూనే ఉంటాం.
ఇలా మొదటి రౌండ్,రెండో రౌండ్ అని ఎలా లెక్కపెడతారు.ఒక రౌండ్లో ఎన్ని ఓట్లను లెక్కిస్తారు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇలా ఒక రౌండ్ పూర్తయిందని ఏ లెక్కలను బట్టి అనౌన్స్ చేస్తారన్న విషయం కూడా చాలామందికి క్లారిటీ ఉండదు.
ఒక నిర్ణీతమైన ఓట్లను లెక్కించడాన్నే మొదటి రౌండ్గా పిలుస్తారు. అంటే ఒక నియోజకవర్గంలో 14 ఈవీఎంలలో ఓట్లు లెక్కించడం పూర్తయితే.. ఒక రౌండ్ ముగిసినట్లు అవుతుంది. అయితే గదిలో 14 ఈవీఎంలను 14 టేబుల్ లపై వేర్వేరుగా పెట్టి ఓట్లను లెక్క పెడతారు.
14 బూతులలో నమోదైన ఓట్ల మొత్తాన్ని కూడా లెక్కపెట్టి.. ఈ లెక్కింపు పూర్తయిన తర్వాత మొదటి రౌండ్ పూర్తయిందని ప్రకటిస్తారు. అంటే ప్రతీ నియోజకవర్గంలోని ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్య పెరగడం, తగ్గడం ఉంటాయి. అంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఎక్కువ రౌండ్లు.. తక్కువ ఓట్లు ఉంటే తక్కువ రౌండ్లు ఉంటాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY