కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్ కన్నుమూత

Ahmed Patel death, Ahmed Patel Passes Away, Congress Leader Ahmed Patel, Congress Senior Leader, Congress Senior Leader MP Ahmed Patel Passes Away, Congress Veteran Ahmed Patel Dies, Congress veteran Ahmed Patel dies at 71, Mango News Telugu, MP Ahmed Patel Passes Away, Senior Congress leader Ahmed Patel passes away

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ పటేల్ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. అక్టోబర్ 1 న అహ్మద్‌ పటేల్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా అప్పటినుంచే గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో ఆరోగ్యం మరింతగా క్షీణించిందని, ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు అహ్మద్ పటేల్ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి అహ్మద్‌ పటేల్ సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కీలక రాజకీయ సలహాదారుగా ఆయన వ్యవహరించారు. 2004, 2009 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ‌అహ్మద్‌ పటేల్ కీలకపాత్ర పోషించారు. మంచి వ్యూహకర్తగా, పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించే ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తూ తనకంటూ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. మూడుసార్లు లోక్‌సభ, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా మొత్తం ఎనిమిది సార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విలువైన అహ్మద్‌ పటేల్ మృతి చెందడంతో ప్రధాన కాంగ్రెస్ నాయకులు దిగ్బ్రాంతికి గురయ్యారు. అహ్మద్‌ పటేల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కీలక నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here