ఇది ఎన్నికల నామ సంవత్సరం. మనదేశంలో మాత్రమే కాదు, యుఎస్ సహా ప్రపంచవ్యాప్తంగా 64 కు పైగా దేశాలలో ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయితే, మరికొన్ని చోట్ల ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఓటింగ్‌లో అందరూ పాల్గొంటారా అని అంటే లేదనే సమాధానమే వస్తోంది. మన హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలలో గతానుభవాలను చూస్తే, విద్యావంతులకంటే మిగిలిన వారే నయమనిపిస్తుంది. ఎన్నికల వేళ భావోద్వేగాలను రెచ్చగొట్టడం, వాగ్ధానాలు చేయడం తప్ప చేసిందేమైనా ఉందా అంటూ కొందరు ఓటింగ్‌కు దూరం ఉంటున్నారు. ఎన్నికలలో పాల్గొంటున్న యువతరం సంఖ్య దేశంలో తక్కువగానే ఉంటుంది.
హైదరాబాద్ లాంటి నగరాల్లో ఓటరు పోలింగ్ బూత్‌కు రావడం కష్టంగానే ఉంది. అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావాలంటే కంపల్సరీ ఓటింగ్ ఒక్కటే మార్గం అని చెబుతున్నారు గత ఎన్నికల పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలించిన మరికొందరు అధ్యయనకారులు. కొన్ని దేశాలలో ఈ తరహా ఓటింగ్ ఉందని, మనదేశంలో అది అమలు చేయడం కష్టమేకానీ, ఆ దిశగా ఆలోచన చేస్తే ఫలితాలు మాత్రమే కాదు, రాజకీయ నాయకుల తీరూ మారే అవకాశాలున్నాయని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయడం అనేది బాధ్యత. కానీ, హక్కులు గురించి మాట్లాడే చాలామంది ఈ బాధ్యతను నిర్వర్తించడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదన్నది అందరికీ తెలిసిన అంశం. ప్రజలలో ఓటింగ్ పట్ల నిరాసక్తత గమనించి కొన్ని దేశాలు ఓటింగ్‌ను కంపల్సరీ చేశాయి. మరికొన్ని దేశాలైతే ఓటు వేయకుంటే జరిమానాలూ విధిస్తున్నాయి.
అర్జెంటినాలో 1912నుంచి ఓటు వేయడం తప్పనిసరి చేశారు. 16-18 మధ్య సంవత్సరాల వ్యక్తులకు స్వచ్ఛందం కానీ, మిగిలిన వారికి మాత్రం ఓటు వేయడం తప్పని సరి. ఆస్ట్రేలియాలో 1924 నుంచి ఓటు వేయడం తప్పనిసరి. బ్రెజిల్‌లో 1932లో కంపల్సరీ ఓటింగ్ పరిచయం చేశారు. కాకపోతే నిరక్ష్యరాసులు, 16-18 సంవత్సరాల యువత, 70 ఏళ్లు దాటిన వారికి మాత్రం ఐచ్ఛికం. సింగపూర్ లో సరైన కారణం చెప్పకపోతే ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. మరలా నమోదు చేసుకోవాలి. సరైన కారణం చెప్పకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇక బెల్జియం లాంటి దేశాలలో ఓటరు కాకపోతే, ప్రభుత్వ ఉద్యోగం పొందడం కూడా కష్టమే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY