ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య, 22 మంది జవాన్లు మృతి

22 jawans killed in ambush in Chhattisgarh, 22 Security Personnel Killed and Several Injured, 22 security personnel killed in Sukma, Chhattisgarh, Chhattisgarh 22 jawans killed, Chhattisgarh Bijapur Encounter, Chhattisgarh Encounter, Chhattisgarh encounter Latest News, Chhattisgarh encounter News, Chhattisgarh Maoist attack, Chhattisgarh Naxal attack, Chhattisgarh Naxal attack claims lives, Chhattisgarh Naxal attack claims lives of 22 security personnel, Mango News

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-సుకమ జిల్లాల సరిహద్దుల్లో శనివారం సాయంత్రం భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ సంఘటనలో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరికి బీజాపూర్‌, రాయ్‌పూర్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. గాలింపు చర్యల్లో ఉన్న సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ సిబ్బందిపై మావోయిస్టులు ఒక్కరిసారిగా కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటనలో కొంతమంది భద్రతా సిబ్బంది గల్లంతైయ్యారు. వారి కోసం బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని అడవుల్లో ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఈ ఘటనలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, క్రీడా, సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని పేర్కొన్నారు. గాయపడిన వారంతా త్వరగా కోరుకోవాలని ప్రార్ధించారు. మరోవైపు మావోయిస్టులుకు దీటైన సమాధానం ఇస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. సోమవారం నాడు ఈ ఎన్ కౌంటర్ జరిగిన స్థలాన్ని అమిత్ షా సందర్శించనున్నారు. అలాగే గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను అమిత్ షా పరామర్శించనున్నారు.

ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ప్రాణనష్టం జరిగిందని సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ తెలిపారు. దాదాపుగా 30 మంది మావోయిస్టులు మరణించిన ఉంటారని, అయితే ఎంత మంది చనిపోయారో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌ స్పందిస్తూ, ఎలాంటి ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదని అన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసే పనులను కూడా త్వరితగతిన పూర్తవుతాయని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 18 =