బంగ్లాదేశ్ పౌర సమాజం ఆగ్రహంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయింది. బంగ్లా నుంచి నేరుగా సైనిక హెలికాప్టర్ లో భారతదేశం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆ దేశ ఆర్మీ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. అయితే బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎప్పుడు అదుపులోకి వస్తాయో ఎవరు కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. మరి ఇంతలా బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం ముంచుకు రావడానికి కారణాలను పరిశీలిస్తే. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ మొదటగా నిరసనలు ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారికి రిజర్వేషన్లు కల్పించింది అప్పటి ప్రభుత్వం. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించినది షేక్ ముజిబుర్ రహ్మాన్. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడిగా ఆయనకు ఎనలేని కీర్తి ఉంది. అవామీ లీగ్ పార్టీ తరఫున దేశానికి అధ్యక్షునిగా రెండు సార్లు వ్యవహరించారు. అవామీ లీగ్ పార్టీ మద్దతు దారులే బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారిలో ఎక్కువ ఉన్నారు. ఫ్రీడం ఫైటర్స్ కి రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తుండటంతో మరో వర్గం ఎప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది.
షేక్ ముజిబుర్ రహ్మాన్ అనంతరం ఆయన కుతురు షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ పగ్గాలు చేపట్టారు. షేక్ హసీనా కూడా కోటా రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతూ వచ్చారు. 56 శాతం బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి, 30 శాతం రిజర్వేషన్లు రిజర్వేషన్లు స్వాతంత్ర్య సమరయోధులకు ఇస్తోంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించి గత నెలలో బంగ్లాదేశ్ లోని ఓ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఢాక యూనివర్శిటీలో యువత నిరసనలు మొదలుపెట్టింది. కాగా రెండు వారాల తరువాత బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు మరో తీర్పు వెలువరించింది. ఫ్రీడమ్ ఫైటర్ వారసులకు 30 శాతం రిజర్వేషన్లు కాకుండా 5 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వాలని ఆదేశించింది. అయినప్పటికి యువతలో అలజడి చల్లారలేదు. పోగా నిరసనలు మరింత ఎక్కువగా చెలరేగాయి. గత ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిందని, ప్రత్యర్థి పార్టిని పోటీలో లేకుండా చేసే ప్రయత్నం చేశారని ప్రజల్లో ఆగ్రహా ఆవేశాలున్నాయి. రిజర్వేషన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని షేక్ హసీనా యాంటీ నేషన్స్ గా ముద్ర వేయడం తో పాటు టెర్రరిస్ట్ లు అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేసింది. అంతే కాదు గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ ఎకానమీ కూడా పడిపోయింది. రిజర్వేషన్ల నిరసనలు కాస్త ప్రభుత్వ వ్యతిరేక నిరసనలుగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి.
షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ గత కొంతకాలంగా విద్యార్ధులు చేపట్టిన భారీ ఆందోళనలో ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శాంతిభద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్ హసీనాకు బంగ్లా సైన్యం డెడ్‌లైన్ విధించింది. సైన్యం ఇచ్చిన 45 నిముషాల డెడ్‌లైన్ లోపే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా ప్రకటనకు ముందు షేక్ హసీనా ఢాకా ప్యాలెస్ నుంచి తన సోదరి గణభబన్ తో కలిసి సురక్షిత ప్రదేశానికి బయలుదేరినట్లు వార్తా సంస్థ AFP నివేదించింది. బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం లభించింది. హసీనా ఢాకా నుంచి అగర్తలా కు పయనమయ్యారు.