రేపు 100వ టెస్ట్ ఆడనున్న విరాట్ కోహ్లీ.. సెంచరీ సాధించాలని కోరుకుంటున్న అభిమానులు

Virat Kohli To Play 100th Test Match Tomorrow Against Sri Lanka At Mohali, Virat Kohli To Play 100th Test Match Tomorrow Against Sri Lanka, Virat Kohli To Play 100th Test Match Against Sri Lanka At Mohali, Sri Lanka, Mohali, Virat Kohli To Play 100th Test Match, Virat Kohli, 100th Test Match, India, India Cricket Live News, India Cricket Live Updates, Sri Lanka, Sri Lanka Cricket Live News, Sri Lanka Live Updates, India vs Sri Lanka, India vs Sri Lanka Latest News, India vs Sri Lanka Latest Updates, India vs Sri Lanka Test Match Updates, India vs Sri Lanka Test Match Live Updates, IND vs Sri Lanka 3rd Test Match Latest News, Test Match 2022 Live Updates, Test Match 2022 News, Test Match 2022 Updates, Sri Lanka national cricket team Updates, Sri Lanka national cricket team Live Updates, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Mango News, Mango News Telugu,

విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. రేపు మొహాలీలో శ్రీలంకతో జరుగనున్న మొదటి టెస్ట్‌ ఈ చారిత్రక ఘట్టానికి వేదికవుతోంది. 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపు అభిమానులు స్టేడియానికి బారులు తీరనున్నారు. కోహ్లీ 100వ మ్యాచ్ లో 100 పరుగులు చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా విరాట్ కు శుభాకాంక్షలు  తెలుపుతున్నారు. విరాట్ కోహ్లీ 2011లో వెస్టిండీస్‌తో అరంగేట్రం చేసినప్పటి నుంచి టెస్టు క్రికెటర్‌గా చాలా సాధించాడు. తొలి మ్యాచ్‌లో 19 పరుగులు మాత్రమే చేయగలిగిన కోహ్లీ, ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు సాగిన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు.

ఈ క్రమంలో రేపు మొహాలీలో తన 100వ టెస్టు మ్యాచ్ ఆడేందుకు విరాట్  సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు 99 టెస్టు మ్యాచ్‌ల్లో కోహ్లీ 50.39 సగటుతో 7962 పరుగులు చేశాడు. అలాగే, 68 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించగా, 40 మ్యాచ్‌ల్లో కోహ్లీ విజయం అందించాడు. తొలి పదేళ్ల టెస్టు క్రికెట్‌లో కోహ్లి చేసినన్ని సెంచరీలు ఎవరూ సాధించలేదు. ఇప్పటివరకు టెస్టులలో కోహ్లీ 27 శతకాలు సాధించాడు.  2016లో కోహ్లీ 12 టెస్టుల్లో 1215 పరుగులు చేయడం విశేషం. విరాట్ మరో 38 పరుగులు చేస్తే టెస్టుల్లో 8వేల పరుగులు చేసిన భారత ఆరో ఆటగాడిగా ఘనతను అందుకొంటాడు. మరోవైపు ఈ సిరీస్ ద్వారా రోహిత్‌ శర్మ తొలిసారిగా టెస్టులలో పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + seventeen =